స్టార్ హీరోకు విలన్ గా సునీల్.. పుష్ప రేంజ్ లో ఆయన పాత్ర.!

By Asianet News  |  First Published Nov 4, 2023, 1:51 PM IST

తెలుగు కమెడియన్, యాక్టర్  సునీల్ విలన్ పాత్రల్లో అదరగొడుతున్నారు. ప్రస్తుతం వరుసగా నెగెటివ్ రోల్స్ లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోకు విలన్ గా నటిస్తున్నారు. 
 


తెలుగు కమెడియన్, యాక్టర్  సునీల్ విలన్ పాత్రల్లో అదరగొడుతున్నారు. ప్రస్తుతం వరుసగా నెగెటివ్ రోల్స్ లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోకు విలన్ గా నటిస్తున్నారు. 

తెలుగులో కొన్నేళ్లపాటు కమెడియన్ గా అలరించిన సునీల్ (Sunil)  ప్రస్తుతం వెండితెరపై విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. కొన్ని వందల చిత్రాలతో హ్యాసనటుడిగా మెప్పించారు. ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ‘పూలరంగడు’ సినిమాతో సిక్స్ ప్యాక్ చూపించి ఆశ్చర్యపరిచారు. హీరోగా అప్పటి నుంచి అలరిస్తూనే వస్తున్నారు. మిస్టర్ పెళ్లికొడుకు, తడాఖా,  భీమవారం బుల్లోడు, కృష్ణాటమి, జక్కన్న వంటి చిత్రాలతోనూ అలరించారు. 

Latest Videos

ప్రస్తుతం రూటు మార్చి విలన్ పాత్రలతో అదరగొడుతున్నారు. ‘కలర్ ఫొటో’, ‘పుష్ప’ చిత్రాలతో సెన్సేషన్ గా మారారు. మంగళం శ్రీను పాత్రలో ఎంతలా ఆకట్టుకున్నారో తెలిసిందే. మరోవైపు తమిళంలోనూ విలన్ గానే ఎంట్రీ ఇచ్చారు. ‘మహావీరన్’, ‘జైలర్’, ‘మార్క్ ఆంటోనీ‘ వంటి సినిమాలతో మెప్పించారు. ప్రస్తుతం కార్తీ ‘జపాన్’లోనూ ఓ కీలక పాత్ర చేశారు. 

ఇక సునీల్ శాండిల్ వుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమయ్యారు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeepa)  చిత్రంలో ప్రధాన విలన్ పాత్రలో నటించబోతున్నారు. ‘మ్యాక్స్’(Max) అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. విజయ్ కార్తీకేయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్ ‘పుష్ప’ రేంజ్ ఉన్న ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. రీసెంట్ గానే షూటింగ్ లోనూ జాయిన్ అయ్యారు. 

విభిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా మరింత గుర్తింపు సాధిస్తున్నారు సునీల్. భారీ ప్రాజెక్ట్స్ ల్లో కీలక పాత్రల్లో నటిస్తుండటం ఆయన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ప్రస్తుతం ‘జపాన్’ తోపాటు తెలుగు భారీ చిత్రాలు, మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ ‘గుంటూరు కారం’, ‘గేమ్ ఛేంజర్’, ‘పుష్ప2 : ది రూల్’ వంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలన్నీ ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. 

click me!