రమాప్రభకు కోట్ల ఆస్తి ఇచ్చా.. శరత్ బాబు కామెంట్స్!

Published : Feb 03, 2019, 03:20 PM IST
రమాప్రభకు కోట్ల ఆస్తి ఇచ్చా.. శరత్ బాబు కామెంట్స్!

సారాంశం

ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు, నటి రమాప్రభని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వీరిద్దరూ విడిపోయారు. దాదాపు ఏడేళ్ల పాటు వీరి వివాహ బంధాన్ని కొనసాగించారు. 

ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు, నటి రమాప్రభని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వీరిద్దరూ విడిపోయారు. దాదాపు ఏడేళ్ల పాటు వీరి వివాహ బంధాన్ని కొనసాగించారు. అయితే శరత్ బాబు తనను మోసం చేశాడని, తన ఆస్తులు కాజేశాడని రమాప్రభ చాలా సందర్భాల్లో వెల్లడించింది.

కానీ ఈ విషయంపై శరత్ బాబు ఏనాడు కామెంట్ చేయలేదు. తాజాగా ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్ బాబు ఈ విషయంపై పెదవి విప్పాడు. తనకంటే ఐదారేళ్లు పెద్దదైన రమాప్రభని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశానని చెప్పిన శరత్ బాబు అది పెళ్లి కాదని ఓ కలయిక మాత్రమేనని చెప్పాడు.

జీవితంలో తాను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వలన ఏం కోల్పోయానో అర్ధమైందని, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించి లాభం లేదని అన్నారు. తాను రమాప్రభని మోసం చేశానని, ఆస్తులను కాజేశానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని శరత్ బాబు చెప్పారు. తన పేరుపై ఉన్న ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బుతో రమాప్రభ, ఆమె సోదరుడి పేర్లపై ఆస్తులను కొన్నానని, వాటి విలువ ఇప్పుడు దాదాపు రూ.60 కోట్లని తెలిపారు.

వీటితో పాటు చెన్నైలోని ఉమాపతి స్ట్రీట్ లో మరొక ఆస్తిని కొనిచ్చానని, దాని విలువ కూడా కొట్లలో ఉంటుందని కావాలంటే చెక్ చేసుకోవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ అప్డేట్.. ఇలా అయితే సురేందర్ రెడ్డికి కష్టమేగా ?