ఎస్పీబీ ఆరోగ్య పరిస్ధితి విషమం: ఆసుపత్రికి చేరుకున్న కమల్ హాసన్

Siva Kodati |  
Published : Sep 24, 2020, 10:24 PM ISTUpdated : Sep 24, 2020, 10:25 PM IST
ఎస్పీబీ ఆరోగ్య పరిస్ధితి విషమం: ఆసుపత్రికి చేరుకున్న కమల్ హాసన్

సారాంశం

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలియగానే నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ గురువారం చెన్నై ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. బాలు ఆరోగ్య పరిస్ధితిపై హాస్పిటల్ వర్గాలు  హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో కమల్ ఎంజీఎంకు చేరుకున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఎక్మో, వెంటిలేటర్ ఇతర ప్రాణాధార చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా వుందని వెల్లడించారు.

వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని బులెటిన్‌‌లో ప్రస్తావించారు. గత 24 గంటల్లో ఎస్పీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని ఎంజీఎం వర్గాలు తెలిపాయి. కరోనా నుంచి కోలుకున్నాకా ఆయనకు మరోసారి అనారోగ్యం తిరగబెట్టింది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌