ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి!

Published : Jun 25, 2019, 02:19 PM IST
ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి!

సారాంశం

సినీ నటి ఆర్తి చాబ్రియా వివాహం ఘనంగా జరిగింది. విశరధ్‌ బీడసీ అనే చార్టెడ్ అకౌంటర్ ని సోమవారం నాడు ఆర్తి వివాహం చేసుకొంది.

సినీ నటి ఆర్తి చాబ్రియా వివాహం ఘనంగా జరిగింది. విశరధ్‌ బీడసీ అనే చార్టెడ్ అకౌంటర్ ని సోమవారం నాడు ఆర్తి వివాహం చేసుకొంది. ముంబైలో జరిగినఈ వేడుకకు పలువురు సినీ నటులు హాజరయ్యారు.

ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.. మార్చి 11న ఆర్తి, విశరధ్‌ ల ఎంగేజ్మెంట్ జరిగింది. విశరధ్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పని చేస్తున్నారు.

త్వరలోనే ఆయన ముంబైకి షిఫ్ట్ కాబోతున్నారు. బాలీవుడ్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఆర్తి.. 2003లో తెలుగులో 'ఒకరికి ఒకరు' సినిమాలో నటించింది. ఆ తరువాత తెలుగులో 'ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి', 'గోపి గోడమీద పిల్లి' వంటి చిత్రాల్లో నటించింది.

వెంకటేష్ నటించిన 'చింతకాయల రవి' సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. చివరిగా 2013లో ఓ పంజాబీ సినిమాలో కనిపించిన ఆమె ఆ తరువాత నటనకు గుడ్ బై చెప్పేసింది.  

PREV
click me!

Recommended Stories

Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే