క్షమాపణ చెప్పి,కారణం అడగద్దు అన్న అమీర్ ఖాన్

By Udayavani DhuliFirst Published Nov 27, 2018, 9:27 AM IST
Highlights

నటుడు అమీర్ ఖాన్ తన ప్రతి సినిమా తన తొలిసినిమాలా, ఒక ప్రయోగంలా కష్టపడి చేస్తూంటారు..సక్సెస్  సాధిస్తూంటారు

నటుడు అమీర్ ఖాన్ తన ప్రతి సినిమా తన తొలిసినిమాలా, ఒక ప్రయోగంలా కష్టపడి చేస్తూంటారు..సక్సెస్  సాధిస్తూంటారు. అయితే తాజాగా అమీర్ ఖాన్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'భారీ డిజాస్టర్ అయ్యింది. అమితాబ్ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలే ఉన్నాయి.  కళ్లు చెదిరే సెట్టింగులతో, అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో, సరికొత్త పోరాట సన్నివేశాలతో సుమారు రూ.300 కోట్లు వెచ్చించి ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం ఊహించని విదంగా దెబ్బ కొట్టింది.  రిలీజ్ అయిన మార్నింగ్ షోకే టాక్ తేడా అని వచ్చేసింది.. రివ్యూలన్నీ చాలా దారుణంగా వచ్చాయి.

ఊహించని విధంగా డివైడ్ టాక్ రావడంతో రెండవరోజు నుంచి కలెక్షన్స్ పూర్తి డ్రాప్ అయ్యాయి. దాంతో రకరకాల సమస్యలు నిర్మాతల తలకు  చుట్టుకుంటున్నాయి. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లను ఇలా నిండా ముంచేయడం పట్ల అమీర్ చాలా బాధగా ఉన్నారు. ఆయన ఈ విషయమై తాజాగా స్పందించారు. తనే ఈ పరాజయానికి భాధ్యత తీసుకుంటానని అన్నారు. తనను నమ్మి వచ్చిన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయినందుకు క్షమాపణ చెప్పారు.  ఇండియా స్టోరీ టెల్లర్స్ స్క్రిప్టు కంటెస్ట్ అవార్డ్ ల ఉత్సవం  కు గెస్ట్ గా వచ్చిన ఆయన ఇలా స్పందించారు. 

అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. “నేనే ఈ సినిమా కు చెందిన పూర్తి భాధ్యత తీసుకుంటున్నాను . మేము మా స్దాయిలో బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలనే ప్రయత్నించాం. ఇప్పటికి ఈ సినిమా కొందరికి నచ్చింది.వారికి మా కృతజ్ఞతలు.  అయితే అలాంటివాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. మెజారిటీ జనాలకు సినిమా నచ్చలేదు.  మాకు ఆ నిజం తెలుసు.  మేము దారి తప్పాం అనటంలో డౌట్ ఏమీ లేదు. థియోటర్ కు వచ్చి  సినిమా చూసి నిరాశపడిన వారందరికీ క్షమాపణంలు.  ఎన్నో అంచనాలుతో వచ్చిన వారు ఎంజాయ్ చేయలేకపోయారు .ఆ విషయమై చాలా బాధగా ఉంది” అన్నారు.  

ఇక ఇంత ప్లాఫ్ అవటానికి కారణమేంటి అని ఆయన్ని అడిగితే..దానికి స్పందిస్తూ..“నేను ఇలాటి విషయాలు పబ్లిక్ మాట్లాడటానికి కంఫర్ట్ గా లేను. నా సినిమా నా బిడ్డ లాంటిది. కాబట్టి ఫెయిల్యూర్ కూడా నాదే .” అని తేల్చి చెప్పారు.

విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమితాబచ్చన్‌, కత్రీనాకైప్‌, ఫాతిమాసనా షేక్‌లు కీలకపాత్రల్లో కనిపించారు. నవంబర్‌ 7న విడుదల అయ్యింది హాలీవుడ్‌ స్థాయిలో రూపొందింది అని ప్రచారం జరిగిన  ఈ సినిమాలో రెండు లక్షల కిలోల బరువున్న భారీ పడవలను ఏడాది నుంచి తయారుచేశారు. యూరప్‌లోని మాల్దా సమీపంలో షూటింగ్ చేసారు. విజువల్‌ ఎఫెక్ట్‌లు కూడా భారీగా  ఉన్నాయి.  అయితే ఎన్ని ఉన్నా...సినిమా లో విషయం లేకపోవటం దెబ్బ కొట్టింది. 

click me!