
కెరీర్ ప్రారంభంలో ‘ప్రేమ కావాలి, లవ్లీ’ వంటి ప్రేమకథా చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆది సాయి కుమార్. అయితే ఆ తర్వాత హిట్ అనేది అతనికి అందరి ఆకాశం అయ్యిపోయింది. వరస సినిమాలతో హిట్ కోసం పరితపిస్తున్న ఆది రీసెంట్ గా బుర్రకథతో మన ముందుకు వచ్చారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ ప్లాఫ్ నుంచి బయిటపడేందుకు అన్నట్లుగా వెంటనే జోడి టైటిల్ తో రూపొందే ఓ చిత్రంతో రెడీ అయ్యిపోయారు.
జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్ తాజాగా విడుదల చేశారు. ఓ అబ్బాయి అమ్మాయి మధ్య పరిచయం ప్రేమగా ఎలా మారిందన్న థీమ్ ని లైట్ ఫన్ ని టచ్ చేస్తూనే చక్కని కెమిస్ట్రీని ఇద్దరి మధ్య పండించారు. టీజర్ వరకూ బాగానే ఉన్న జోడి..సినిమాగా ఎలా ఉంటుందో చూడాలి.
నూతన దర్శకుడు విశ్వనాథ్ అరిగెల తెరకెక్కించిన ‘జోడీ’లో ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించారు. పద్మజ, సాయి వెంకటేశ్ గుర్రం నిర్మాతలు. ‘‘హీరో, హీరోయిన్ జోడీ మధ్య జరిగే ప్రేమకథ, వాళ్ల కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్. పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: ‘నీవే’ ఫణి కల్యాణ్, కెమెరా: విశ్వేశ్వర్.