The Ghost: యుద్దానికి కత్తి సిద్ధం చేసిన ఏజెంట్ విక్రమ్... ది ఘోస్ట్ ప్రోమో అదుర్స్!

By Sambi ReddyFirst Published Aug 18, 2022, 3:40 PM IST
Highlights

కింగ్ నాగార్జున ఈసారి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ విడుదలకు సిద్దమవుతుంది. కాగా నేడు చిత్ర యూనిట్ స్పెషల్ ప్రోమో విడుదల చేశారు.

బంగార్రాజు మూవీతో హిట్ కొట్టిన నాగార్జున ఈసారి పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీ తెరకెక్కుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి నేడు స్పెషల్ ప్రోమో విడుదల చేశారు. అలాగే ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 

ప్రోమోలో కింగ్ నాగార్జునకు సందేశం అందుతుంది. తనపై అటాక్ జరగనుందని ఆ సందేశం సారాంశం. ఇక శత్రువులను అంతమొందించడానికి నాగార్జున స్వయంగా కత్తి సిద్ధం చేసుకోవడం ప్రోమో చూడవచ్చు. రెండు నిమిషాల ప్రోమో సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా నాగార్జున మాజీ ఏజెంట్ విక్రమ్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. నాగార్జున కెరీర్ లో ది ఘోస్ట్ మంచి చిత్రంగా నిలిచిపోయే అవకాశం కలదు. ఇక ఘోస్ట్ మూవీ ట్రైలర్ ఆగస్టు 25న విడుదల కానుంది. 

నాగార్జునకు జంటగా సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. బడ్జెట్ కి వెనుకాడకుండా చాలా భాగం విదేశాల్లో చిత్రీకరించారు. దుబాయ్ తో పాటు దేశాల్లో ఘోస్ట్ చిత్రీకరణ జరిగింది. ప్రతికూల పరిస్థితుల మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అక్టోబర్ 5న దసరా కానుకగా ది ఘోస్ట్ విడుదల కానుంది. ది ఘోస్ట్ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు. 

click me!