డబల్ ఇస్మార్ట్ నుండి క్రేజీ అప్డేట్!

Published : Jul 09, 2023, 06:03 PM IST
డబల్ ఇస్మార్ట్ నుండి క్రేజీ అప్డేట్!

సారాంశం

రామ్ పోతినేని-పూరి జగన్నాథ్  కాంబోలో డబల్ ఇస్మార్ట్ టైటిల్ తో మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. రేపు ఈ చిత్రం నుండి క్రేజీ అప్డేట్ రానుంది.    

దర్శకుడు పూరి జగన్నాథ్-ఛార్మి కౌర్ నిర్మాణ భాగస్వాములుగా అరడజను సినిమాలకు పైగా చేశారు. వాటిలో హిట్టైంది మాత్రం ఒకటే. అదే ఇస్మార్ట్ శంకర్. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ వరల్డ్ వైడ్ రూ. 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా మేకింగ్ కి ఉన్నవన్నీ అమ్మి పెట్టారు పూరి, ఛార్మి. లక్ కలిసొచ్చి హిట్ పడింది. ఈ సినిమా హాలీవుడ్ మూవీ ఐబాయ్ కి కాపీ అనే విమర్శలు వినిపించాయి. పూరి కూడా ఇస్మార్ట్ శంకర్ హాలీవుడ్ మూవీ ఇన్సిపిరేషన్ అని ఒప్పుకున్నారు. 

ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన జోష్ తో లైగర్ మూవీ ప్రకటించారు. పాన్ ఇండియా లెవెల్ లో భారీగా ప్లాన్ చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా లైగర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కథ మళ్ళి మొదటికి వచ్చింది. పూరి జగన్నాధ్ కి ఏ హీరో ఆఫర్ ఇచ్చే పరిస్థితి లేదు. తనకు ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు పూరిని రామ్ పోతినేని ఆదుకున్నాడు. 

వీరి కాంబోలో డబల్ ఇస్మార్ట్ టైటిల్ తో ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ మూవీకి కూడా పూరి, ఛార్మి నిర్మాతలుగా ఉన్నారు. రేపు డబల్ ఇస్మార్ట్ నుండి అప్డేట్ ఇస్తున్నారు. ఉదయం 11:11 నిమిషాలకు క్రేజీ న్యూస్ షేర్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో రామ్ పోతినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం రామ్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో స్కంద చేస్తున్నారు. స్కంద పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 15న విడుదల కానుంది. శ్రీలీల హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?