అద్భుతమైన ఫీచర్లతో టయోటా కొత్త వెర్షన్ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో విడుదల..

By Sandra Ashok Kumar  |  First Published Sep 1, 2020, 3:47 PM IST

ఈ కారుకి ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అమర్చారు. 2982 సి‌సి డీజిల్ ఇంజన్, వేరియబుల్ ఫ్లో కంట్రోల్ (విఎఫ్‌సి) హైడ్రాలిక్ స్టీరింగ్ ఇంకా ఫోర్ వీల్ డ్రైవ్‌తో వస్తుంది. 2021 ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో కొత్త ఆయిల్ బర్నర్‌తో రానుంది. 


 జపాన్ వాహన తయారీ సంస్థ టయోటా కొత్త వెర్షన్ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ కారుకి ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అమర్చారు. 2982 సి‌సి డీజిల్ ఇంజన్, వేరియబుల్ ఫ్లో కంట్రోల్ (విఎఫ్‌సి) హైడ్రాలిక్ స్టీరింగ్ ఇంకా ఫోర్ వీల్ డ్రైవ్‌తో వస్తుంది.

2021 ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో కొత్త ఆయిల్ బర్నర్‌తో రానుంది. అదనంగా ఇంజిన్ ఆప్టిమైజ్ చేసిన పిస్టన్ అండ్ రింగ్, లాంగ్ టర్నింగ్, ఇంపెల్లర్‌తో టర్బోచార్జ్డ్ బాల్-బేరింగ్, అధిక ఇంధన ఇంజెక్షన్ ప్రవాహం రేటు, అప్ డేట్ చేసిన ఎగ్జాస్ట్, సవరించిన సిలిండర్ బ్లాక్ ఉంది.

Latest Videos

ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పాడిల్ షిఫ్టర్లు, అడాప్టివ్ వేరియబుల్ సస్పెన్షన్, క్రాల్ కంట్రోల్, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, రియర్ ఎయిర్ సస్పెన్షన్, మల్టీ-టెర్రైన్ మోడ్‌తో తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఇందులో ఉంది.

also read  

రి అడ్జస్ట్ చేసిన ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో మూడు టన్నుల సామర్ధ్యం కలిగి ఉంటుంది. టయోటా సేఫ్టీ సెన్స్ ప్యాకేజీలో స్టాండర్డ్ ప్రీ-కలక్షన్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, రోడ్ సైన్ అసిస్ట్, యాక్టివ్ క్రూయిస్ కంట్రోల్, ఏడు ఎయిర్‌ బ్యాగులు, విఎస్‌సి, టిసి, ఎబిఎస్, ఇబిడి, బిఎ, ట్రైలర్ స్వే కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి.

దీని మైలేజ్ 11.0 కే‌ఎం‌పి‌ఎల్, 620 లిటర్స్ బూట్ స్పేస్ ఉంది. ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో 7 సీట్ల ఎస్‌యూవీ. దీని పొడవు 4780 ఎం‌ఎం, వెడల్పు 1885 ఎం‌ఎం, వీల్‌బేస్ 2790 ఎంఎం.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో  6 సంవత్సరాల మైన్ టైనాన్స్ వ్యయం రూ .41,495. మొదట వెయ్యి కిలోమీటర్లుకు  ఫస్ట్ సర్వీసింగ్ తరువాత 10వేల  కిలోమీటర్లకు రెండవ సర్విసింగ్ కూడా పూర్తిగా ఉచితం. టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో 11 వేర్వేరు రంగులలో లభిస్తుంది. ఇండియాలో దీని ధర రూ.96.30 లక్షలు
 

click me!