మార్కెట్లోకి మహీంద్రా నుంచి సరికొత్త బొలెరో ప్లస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ కారుకు సంబంధించిన ధర, ఫీచర్లను తెలుసుకుందాం.
మహీంద్రా అండ్ మహీంద్రా బొలెరో నియో (Bolero Neo) పేరిట రివైజ్డ్ మోడల్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఇప్పుడు కంపెనీ దాని మరొక అప్ డేటెడ్ వర్షన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు పరీక్షిస్తోంది. మహీంద్రా బొలెరో నియో (Bolero Neo) ప్లస్ అని పిలిచే ఈ SUV రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది. అవి ఏడు, తొమ్మిది సీట్లు కావడం విశేషం. ఏడు సీట్ల లేఅవుట్ P4, P10, P10 (R) అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
బొలెరో నియో (Bolero Neo) ప్లస్ బొలెరో నియో (Bolero Neo) కంటే 400 మిమీ పొడవుగా ఉంది, అయితే దీని వీల్‌బేస్ మారడం లేదు. అంటే 2,680 మిమీ ఉంటుంది. దీని మొత్తం పొడవు, వెడల్పు , ఎత్తు వరుసగా 4400mm, 1795mm , 1812mm గా ఉంది.
వర్టికల్ క్రోమ్ స్లాట్‌లు, ట్రాపెజోయిడల్ ఎయిర్ డ్యామ్, వెనుక టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్, ర్యాప్‌రౌండ్ టెయిల్‌ల్యాంప్‌లతో కొత్తగా రూపొందించిన మెష్ గ్రిల్‌ను కలిగి ఉన్నట్లు తాజా ఇంటర్నెట్ లో లీక్ అయిన ఫోటోలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మీరు కారు ప్రొఫైల్‌లో నలుపు రంగు అప్లిక్‌లను చూడవచ్చు. మహీంద్రా బొలెరో నియో (Bolero Neo) ప్లస్ 7-సీటర్ వెర్షన్‌లో మూడవ వరుసలో బెంచ్-టైప్ సీట్లు , 9-సీటర్ మోడల్‌లో జంప్ సీట్లు ఉంటాయి. మోడల్ లైనప్‌లో బెడ్‌తో కూడిన 4-సీటర్ అంబులెన్స్ వేరియంట్ ఉంది.
కొత్త మహీంద్రా బొలెరో నియో (Bolero Neo) ప్లస్ 2.2L mhawk డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది ఎకానమీ మోడ్‌లో 94bhp , పవర్ మోడ్‌లో 120bhpని ఉత్పత్తి చేస్తుంది. SUVలో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉండే అవకాశం ఉంది.
ధర విషయానికొస్తే, బొలెరో నియో (Bolero Neo) ప్లస్ దాని బొలెరో నియో బేసిక్ మోడల్ కంటే రూ. 1 లక్ష ఎక్కువ అవుతుంది. మహీంద్రా బొలెరో నియో (Bolero Neo) ప్రస్తుతం రూ. 9.5 లక్షల నుండి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో అందుబాటులో ఉంది. ఇటీవల, మహీంద్రా XUV400 ఫార్ములా ఎడిషన్ రేసింగ్ స్పిరిట్‌తో ప్రేరణ పొందిన ప్రత్యేక లివరీ మోడల్ తో వస్తోంది. ఈ మోడల్‌ను మహీంద్రా ఫార్ములా E UK , మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరోప్ (MAED) స్టూడియో రూపొందించాయి.