4 లక్షల కార్లను రీకాల్ చేసిన నిస్సాన్, మీ కారు మోడల్ కూడా ఉందేమో వెంటనే చెక్ చేసుకోండి..

By Krishna Adithya  |  First Published Feb 17, 2023, 12:27 AM IST

ప్రముఖ ఆటో దిగ్గజం నిస్సాన్ మార్కెట్లోని దాదాపు నాలుగు లక్షల కార్లను రీ కాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పలు మోడల్ కార్లలో లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడం ద్వారా కస్టమర్లకు సేఫ్టీ ఇవ్వడమే తమ తొలి ప్రాధాన్యత అని నిస్సాన్ ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ మధ్యకాలంలో పలు ఆటో కంపెనీలు తమ కార్లలో లోపాలను గుర్తించి మార్కెట్లోని కార్లను రీ కాల్ చేస్తున్నాయి ఈ కొవ్వలోకి ఇప్పటికే మారుతి సహా పలు కంపెనీలు వచ్చి చేరాయి. గతంలో మారుతి కారు కూడా తమ కంపెనీకి చెందిన పలు మోడల్ కార్లలో  లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు మార్కెట్లోని తమ కంపెనీ కార్లను రీకాల్ చేసింది. తాజాగా  నిస్సాన్  కంపెనీ కూడా మార్కెట్లోని మొత్తం నాలుగు లక్షల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది దీంతో ఆటో రంగంలో ఒక్కసారిగా కలకలం వేగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

నిస్సాన్ కారులో  సీట్ బెల్టులు, స్టీరింగ్ వీల్ లో లోపాల కారణంగా కంపెనీ 4 లక్షలకు పైగా యూనిట్లను రీకాల్ చేసింది. ఈ లోపాలు ఉత్తర అమెరికాలో గుర్తించారు. ఆ తర్వాత కంపెనీ అక్కడ 463,000 వాహనాలను రీకాల్ చేసింది. తమ కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 

Latest Videos

undefined

నిస్సాన్ ఈ మోడల్ కార్లను  రీకాల్ చేసింది
నిస్సాన్ రీకాల్ చేసిన కార్లలో 2008 నుండి 2011 వరకు కొన్ని ఫ్రాంటియర్ ఫ్లాగ్‌షిప్‌ కార్లు ఉన్నాయి. రీకాల్ చేసిన వాహనాల్లో టైటాన్, ఎక్స్‌టెర్రా, పాత్‌ఫైండర్, ఆర్మడ SUV వంటి మోడళ్లు ఉన్నాయి. దీనితో పాటు, కంపెనీ 2008 , 2009 క్వెస్ట్ మినీవ్యాన్‌లను కూడా రీకాల్ చేసింది. కంపెనీ కార్లలో ఉపయోగించిన దాదాపు 11,000 విడిభాగాలను కూడా రీకాల్ చేసింది. కంపెనీ తరపున సమాచారం ఇస్తూ, ఈ లోపాల వల్ల ఎవరైనా గాయపడవచ్చని తెలిపింది. అందుకే కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

సర్వీసింగ్ కోసం ఎప్పుడు వెళ్లాలి
మీడియా కథనాల ప్రకారం, కారు సర్వీసింగ్‌ను కంపెనీ ఇంకా ప్రారంభించలేదు. దీని గురించి ఏప్రిల్‌లో వినియోగదారులకు మెయిల్ ద్వారా తెలియజేయనుంది. సర్వీసింగ్ కోసం వెళ్ళవలసి వచ్చినప్పుడు. వారు డీలర్‌ ద్వారా ఈ లోపాలను సరిదిద్దే  సదుపాయాన్ని కల్పించనుంది. 

రెనాల్ట్‌తో భాగస్వామ్యం
నిస్సాన్-రెనాల్ట్‌తో కలిసి, భారతీయ మార్కెట్‌ను తన ముద్రను మరింత బలంగా వేసుకునేందుకు సన్నాహాలు జరుపుతోంది. ఇందుల భాగంగా  రెండు కంపెనీలు పరస్పర భాగస్వామ్యంతో 6 కొత్త మోడళ్లను తీసుకురాబోతున్నాయి. వీటిలో 4 కొత్త C సెగ్మెంట్ SUVలు, రెండు కొత్త A సెగ్మెంట్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఇందులో రెండు కంపెనీల నుంచి మూడు మోడల్స్ ఉన్నాయి. ఈ గ్లోబల్ మాడ్యూల్స్ ఫ్యామిలీ ప్లాట్‌ఫారమ్ ఆధారితంగా ఉంటాయి. చెన్నైలోని కంపెనీల ప్లాంట్లలో దేశీయ స్థాయిలో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ కొత్త ప్రాజెక్టులో కంపెనీ రూ.5,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

click me!