జీప్ కంపాస్ సంస్థ దేశీయ మార్కెట్లోకి కొత్త మోడల్ స్పోర్ట్ ప్లస్ కారును ఆవిష్కరించింది. డీజిల్ వేరియంట్ కారు ధర రూ.16.99 లక్షలు పలుకుతుంటే, పెట్రోల్ వేరియంట్ మోడల్ రూ.15.99 లక్షలకే లభిస్తోంది. పలు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను ఇందులో చేర్చారు.
ముంబై: మార్కెట్లోకి జీప్ కంపాస్ స్పోర్ట్స్ ప్లస్ విడుదలైంది. దీని ధర రూ.15.99 లక్షలుగా నిర్ణయించారు. డీజిల్ వేరియంట్ కారు ధరూ. 16.99 లక్షలుగా ఉంది. దీనిలోకి అన్ని రకాల సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 16 అంగుళాల స్పోర్ట్స్ అలాయ్ వీల్స్, డ్యూయల్‌జోన్ ఆటో ఎయిర్ కండీషన్, రియర్ పార్కింగ్ సెన్సార్, బ్లాక్ రూఫ్ రైల్, స్పోర్ట్ ప్లస్ బ్యాడ్జి అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ తెలిపింది. మిగిలిన 21 ఫీచర్లకు అదనంగా వీటిని అందిస్తున్నారు. ఈ కారులో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు అందుబాటులో ఉన్నాయి.
ఇది రెండు రకాల ఇంజిన్లలో లభిస్తోంది. 2.0 మల్టీజెట్ ఇంజిన్, 6స్పీడ్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్‌లలో లభిస్తుంది. మరో వేరియంట్‌లో 1.4లీటర్ మల్టీఎయిర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 6స్పీడ్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది. ఎఫ్‌సీఏ ఇండియా అధ్యక్షుడు, ఎండీ కెవిన్ ఫ్లయన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ‘కొత్త జీప్ కంపాస్ స్పోర్ట్స్ ప్లస్‌లో అన్ని రకాల అదనపు హంగులు ఉన్నాయి. మంచి ధరకు జీప్‌లో అన్ని రకాల అదనపు హంగులు లభిస్తున్నాయి. ఊహించని చాలా ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చాం’అని పేర్కొన్నారు.
స్పోర్ట్ వేరియంట్ మోడల్ కారుతో పోలిస్తే జీప్ కంపాస్ స్పోర్ట్స్ ప్లస్ రూ.39 వేలు అధికం. స్పోర్ట్స్ ప్లస్ డీజిల్ వేరియంట్ కారు రూ.38 వేలు అధికం. రేర్ పార్కింగ్ సెన్సర్లు, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 5.0- ఇంచ్ టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ ప్లే, పవర్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్ ఉన్నాయి.
వీటికి అదనంగా పొడవైన వాటిలో 7.0 అంగుళాల ఇన్ఫోటైమెంట్ స్క్రీన్, లాంగిట్యూడ్ వేరియంట్ కారులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చారు. ఇంకా అదనంగా డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్సీ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ తదితర ఫీచర్లు జత కలిశాయి. ఇది ప్రత్యేకించి టాటా హారియర్ ఎక్స్ టీ తో పోటీ పడుతుందని భావిస్తున్నారు.
వరుసగా రెండో నెలలో ఉత్పత్తి తగ్గించిన మారుతి సుజుకి
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఉత్పత్తి వరుసగా రెండో నెలలో కూడా భారీగా పడిపోయింది. కంపెనీకి చెందిన కార్లకు డిమాండ్ లేకపోవడంతో మార్చిలో ఉత్పత్తిని 21 శాతం తగ్గించుకున్నది. గత నెలలో 1,36, 201 యూనిట్లను ఉత్పత్తిచేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తి చేసిన 1,72,195 యూనిట్లతో పోలిస్తే 20.9 శాతం తక్కువ. వీటిలో ప్యాసింజర్ వాహనాలైన ఆల్టో, స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జాల ఉత్పత్తి 21 శాతం తగ్గించుకున్న సంస్థ..కాంప్యాక్ట్ సెగ్మెంట్‌లో 7.5 శాతం, యుటిలిటీ వాహన విభాగంలో 26.4 శాతం కోత పెట్టింది. కానీ వ్యాన్ల ప్రొడక్షన్ మాత్రం ఆరు శాతం పెంచుకున్నది. ఉ త్పత్తి తగ్గింపుపై సంస్థ ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. ఫిబ్రవరిలోనూ సంస్థ ఉత్పత్తిని 8 శాతం కోత పెట్టింది.