ముకేశ్ అంబానీకి గల లగ్జరీ కార్లకు కొదవే లేదు. రోల్స్ రాయిస్, లంబోర్ఘిని, బెంట్లీ వంటి కార్లు ముకేశ్ అంబానీ కార్ల గ్యారేజీలో కొలువు దీరే ఉన్నాయి. ముకేశ్ ఇంట్లో సుమారు 168 కార్లను పెట్టుకునే గ్యారేజీ ఉన్నదంటే ఎంత విశాలమో అర్థం చేసుకోవచ్చు. అటువంటి ముకేశ్ అంబానీ ఇటీవల సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు.
ముకేశ్ అంబానీ.. రిలయన్స్ అధినేత. ఆయన ఏం చేసినా వార్తే. ఆయన సంపద విలువ రూ.3 లక్షల కోట్ల పై చిలుకే. తలుచుకుంటే కార్ల తయారీ సంస్థనూ ఏర్పాటు చేయగల సామర్థ్యం ఆయన సొంతం
ముకేశ్ అంబానీకి గల లగ్జరీ కార్లకు కొదవే లేదు. రోల్స్ రాయిస్, లంబోర్ఘిని, బెంట్లీ వంటి కార్లు ముకేశ్ అంబానీ కార్ల గ్యారేజీలో కొలువు దీరే ఉన్నాయి.
ముకేశ్ ఇంట్లో సుమారు 168 కార్లను పెట్టుకునే గ్యారేజీ ఉన్నదంటే ఎంత విశాలమో అర్థం చేసుకోవచ్చు. అటువంటి ముకేశ్ అంబానీ ఇటీవల సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు.
ఇటీవల ముంబైలో ‘టెస్లా మోడల్ ఎస్ 100 డీ’ మోడల్ కారు ఒకటి కనిపించింది. అత్యంత శక్తివంతమైన ఈ ఎలక్ట్రానిక్ కారును నేరుగా మనదేశంలో విక్రయించట్లేదు. అటువంటి కారు ముంబై వీధుల్లో కనిపించేసరికి జనమంతా ఆసక్తిగా చూశారు.
ఆటోమొబైల్ ఫొటోగ్రాఫర్ నిర్మిత్ పాటిల్ క్లిక్‌మనిపించి.. ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో టెస్లా ఎస్100డీ కారు ముంబైలో అడుగు పెట్టిందని తెలియగానే దాని యజమాని ఎవరో తెలుసుకోవాలన్న ఆరాటం నెటిజన్లలో మొదలైంది.
నంబర్ ప్లేట్ ఆధారంగా సెర్చి చేస్తే వచ్చిన జవాబు చూసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది. అదే మరి ఆ కారు ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ పేరిట రిజిస్టరై ఉంది. అదీ సెకండ్ హ్యాండ్ కారుగా ఉండటం గమనార్హం.
సాధారణంగా లగ్జరీ కార్లను వ్యక్తిగతంగా దిగుమతి చేసుకోవాలంటే చాలా పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దీనికి తోడు వివిధ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
అంబానీ స్థాయి గల కార్పొరేట్ దిగ్గజాలకు అంత టైం ఉండదు. వారి ఉద్యోగులతో చేయిస్తే కొన్ని సార్లు అనవసర ప్రచారంతో సమస్యలు కొని తెస్తుంది. దీనికి బదులు ఒక దిగుమతి దారుడు విదేశాల నుంచి తొలుత భారతదేశానికి సదరు విలసవంతమైన కారును తెప్పిస్తాడు.
అతడే కారుకు అవసరమైన పత్రాలు, ఇతర లాంఛనాలను పూర్తిచేసి, తన పేరిట రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత కొంత లాభం కలుపుకుని శ్రీమంతుల పేరిట బదలాయిస్తారు.
సెకండ్ హ్యాండ్ మార్కెట్లోకి వచ్చే వాహనాల విలువ తగ్గుతుంది. కానీ ఈ విధానంలో దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్ల విలువ మాత్రం పెరుగుతుంది. టెస్టా మోడల్ ఎస్ 100డీ కారు అత్యంత శక్తిమంతమైంది. ఇందులోని మోటార్ 423 పీఎస్ శక్తిని,600 ఎన్ఎం టార్చ్ విడుదల చేస్తుంది.
కేవలం 4.3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. అమెరికాలో ఈ కారు విలువ 99,990 డాలర్లు. మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.77 లక్షల వరకు ఉంటుంది.
టెస్టా మోడల్ ఎస్ 100డీ కారుకు వందశాతం దిగుమతి సుంకం చెల్లిస్తే ఈ కారు విలువ రూ.1.5 కోట్లకు చేరుతుంది. దీని రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నంబర్ తదితర ఖర్చులు అదనం. ఇక ఈ కారు బ్యాటరీ 43 నిమిషాల సేపు చార్జింగ్ చేస్తే ఏకంగా 396 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.