మారుతి సుజుకి తన సబ్ కంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ కారు విటారా బ్రెజ్జా స్పోర్ట్స్ కారును విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.7.98 లక్షల నుంచి మొదలవుతోంది. రెగ్యులర్ మోడల్ కారుతో పోలిస్తే 29,900 ఎక్కువగా నిర్ణయించారు.
భారత దేశంలో ప్రయాణికుల కార్ల సేల్స్‌లో హాట్ హాట్ గా సాగుతున్న మోడల్ మారుతి సుజుకికి చెందిన సబ్ కంపాక్ట్ ఎస్ యూవీ కారు ‘విటారా బ్రెజా’. 2016లో విపణిలోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి విటారా బ్రెజ్జా మోడల్ కారు 4.35 లక్షలకు పైగా అమ్ముడుపోయింది.
నాలుగేళ్ల తర్వాత మారుతి సుజుకి దాని స్పేస్ రేంజ్ పెంచాలని తలపోసింది. అందులో భాగంగానే విటారా బ్రెజ్జా స్పోర్ట్స్ ఎడిషన్ మోడల్ కారును విపణిలో ఆవిష్కరించింది. రెగ్యులర్ మోడల్ కారు ధరతో పోలిస్తే న్యూ స్పోర్ట్స్ ఎడిషన్ మోడల్ కారు విటారా బ్రెజా ధర రూ.29,900 ఎక్కువగా ఉంటుంది.
కారు ధర రూ.7.98 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. విటారా బ్రెజ్జా ఎస్‌యూవీ మోడల్ కారు కాస్మొటిక్స్ కంటే లిమిటెడ్‌గా ఉంటుంది. పరిమితమైన ఎడిషన్‌తో విపణిలోకి వస్తున్న ఈ కారు యాస్సెస్సరీ ప్యాకేజీతో అందుబాటులోకి వస్తుంది.
న్యూ సీట్ కవర్స్, డిజైనర్ మ్యాట్స్, సైడ్ క్లాడింగ్, బాడీ గ్రాఫిక్స్, ఫ్రంట్ అండ్ రేర్ గార్నిష్, లెదర్ స్టీరింగ్ కవర్, డోర్ సిల్ గార్డ్, వీల్ ఆర్క్ కిట్, నెక్ కుషన్ తదితరాల్లో కస్టమర్లు తమకు ఇష్టమైన ఎంపిక చేసుకోవచ్చు.
బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న విటారా బ్రెజ్జా మోడల్ ఫేస్ లిఫ్ట్ కారును కూడా విపణిలో ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతోంది. 1.3 లీటర్ల డీడీఐఎస్ 200 డీజిల్ ఇంజిన్ కలిగి ఉన్న ఈ కారును దశల వారీగా బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా తీర్చి దిద్దుతోంది.
బీఎస్ 6 ప్రమాణాలతో ఫేస్ లిఫ్టెడ్ విటారా బ్రెజ్జా 1.2 లీటర్ల కే12 పెట్రోల్ ఇంజిన్ మోడల్ కారును కూడా ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే అధిక ధరైనా సైరే డిమాండ్ ఉంటే 1.5 లీటర్ల డీడీఐఎస్ 225 డీజిల్ మోటర్ కారును మారుతి సుజుకి విపణిలోకి వదిలేందుకు సిద్ధంగా ఉంది.