ప్రభుత్వ ఉద్యోగుల కోసం మారుతి సుజుకి కార్ల పై ఫెస్టివల్ ఆఫర్.. కొద్దిరోజులు మాత్రమే..

By Sandra Ashok KumarFirst Published Oct 19, 2020, 12:07 PM IST
Highlights

మారుతి సుజుకి ఇండియా ఫెస్టివల్ సీజన్ లో ప్రభుత్వ ఉద్యోగులకు  ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టిసి) క్యాష్ వోచర్ పథకం తర్వాత మారుతి కంపెనీ ఈ ఆఫర్‌తో డిమాండ్‌ను మరింత పెంచాలని ప్రయత్నిస్తోంది.

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఫెస్టివల్ సీజన్ లో ప్రభుత్వ ఉద్యోగులకు  ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టిసి) క్యాష్ వోచర్ పథకం తర్వాత మారుతి కంపెనీ ఈ ఆఫర్‌తో డిమాండ్‌ను మరింత పెంచాలని ప్రయత్నిస్తోంది.

"ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు మారుతి సుజుకి కొత్త వాహనాల కొనుగోలుపై  ప్రత్యేక ఆఫర్లను పొందవచ్చు. డిస్కౌంట్లు ఒక మోడల్ నుండి మరొ మోడల్ కు మారుతూ ఉంటాయి" అని కంపెనీ తెలిపింది.

మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "కోవిడ్-19 మహమ్మారి సమయంలో వినియోగదారుల వ్యయాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, సానుకూల భావాలను వ్యాప్తి చేయడం మా కర్తవ్యం" అని అన్నారు.

also read 

"వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల కింద 1 కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు, వారు మారుతి సుజుకి వినియోగదారులలో అతిపెద్ద విభాగాలలో ఒకరు. దీనిని దృష్టిలో ఉంచుకుని, మేము ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాము. "

ఇటీవల ప్రకటించిన ఎల్‌టిసి క్యాష్ వోచర్ పథకం దాదాపు 45 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ, రక్షణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని కంపెనీ తెలిపింది.  

మారుతి సుజుకి అల్టో, సెలెరియో, ఎస్-ప్రెస్సో, వాగన్-ఆర్, ఈకో, స్విఫ్ట్,  స్విఫ్ట్ డిజైర్, ఇగ్నిస్, బాలెనో, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6, సియాజ్, అరేనా, నెక్సా ఎస్-క్రాస్ వాహనాల పై ఈ ఆఫర్ అందిస్తుంది.
 

click me!