మారుతి మిడ్ లెవల్ ఎస్‌-ప్రెస్సోఈ నెల 30న లాంచ్‌

By Siva Kodati  |  First Published Sep 22, 2019, 11:04 AM IST

ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విపణిలోకి మినీ ఎస్‌యూవీ కారును ఆవిష్కరిస్తోంది. గత 10 నెలలుగా కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పండుగల సీజన్ సందర్భంగా భారీ ఆశలతో మారుతి సుజుకి ఈ మినీ ఎస్‌యూవీ కారు ఈ నెల 30వ తేదీన ఎస్-ప్రెస్సో మోడల్ కారును ఆవిష్కరించనున్నది. 


దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ సరికొత్త కారును కస్టమర్ల ముందుకు తీసుకురానున్నది. ఇప్పటి వరకు ఎస్-ప్రెస్సో పేరుతో వ్యవహరిస్తున్న ఈ మినీ ఎస్‌యూవీ లెవల్ విభాగాన్ని పూర్తిగా మార్చివేస్తుందని మారుతి సుజుకి పేర్కొన్నది. తన లేటెస్ట్‌ హాచ్‌ బ్యాక్ ఎస్-ప్రెస్సో కారును ఈ నెల 30వ తేదీన ఆవిష్కరించనున్నది. 

ఇటీవల ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఎంట్రీ లెవల్‌ కారుగా దీన్ని మారుతి సుజుకి ప్రదర్శించింది. నాలుగు వేరియంట్లలో ఈ కారును మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. అయితే ఇది తొమ్మిది వేరియంట్లలో రూపుదిద్దుకుంటున్నది. 

Latest Videos

ఎస్టీడీ (ఓ), ఎల్ఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ ప్లస్, వీఎక్స్ఐ ఏజీఎస్, వీఎక్స్ఐ (ఓ) ఏజీఎస్, వీఎక్స్ఐ ప్లస్ ఏజీఎస్ మోడళ్లలో రూపుదిద్దుకుంటున్నది. ఈ కారు పూర్తిగా దేశీయ టెక్నాలజీతో భారతీయ అవసరాల కోసం తయారు చేశామని మారుతి సుజుకి తెలిపింది.

మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ ‘యువత కారు కొనుగోలు చేసే సమయంలో ఖరీదు, నిర్వహణ ఖర్చు చూసేవారు. ఇప్పుడు డిజైనింగ్, లుక్స్‌ను పట్టించుకుంటున్నారని మా పరిశోధనలో తేలింది’ అని పేర్కొన్నారు.

సంస్థ మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ రామన్ స్పందిస్తూ ‘మారుతి సుజుకి తయారుచేసిన ఎస్-ప్రెస్సో చిన్న కార్ల విభాగంలో భారీ మార్పులు తీసుకు వస్తుంది. దీని డిజైన్ లాంగ్వేజ్ మా ఎస్ యూవీ లైనప్‌ను ప్రతిబింబిస్తుంది. దీంతోపాటు ఆధునిక జీవన శైలిని తలపిస్తుంది’ అని చెప్పారు. 

ఎస్-ప్రెస్సో మోడల్ కారు మారుతి సుజుకి స్పోర్టీ లుక్‌లో వస్తుందని భావిస్తున్నారు. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, పవర్ 68హెచ్‌పీ, టార్క్ 90 ఎన్‌ఎమ్, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది.

దీంతోపాటు సీఎన్‌జీ మోడల్‌ను కూడా ఆవిష్కరించనుంది. ఇక ధర విషయానికి వస్తే ప్రారంభ ధర రూ .4 లక్షలు నిర్ణయించవచ్చని అంచనా. 

పూర్తిగా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మోడల్ మినీ ఎస్‌యూవీ కారు బీఎస్- 6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్నది. 998 సీసీ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌తో తయారైన ఎస్-ప్రెస్సో తన ప్రత్యర్థి సంస్థలు రెనాల్ట్ క్విడ్, డస్టన్ రెడీ-గో మోడల్ కార్లకు గట్టిపోటీనిస్తోంది.

ఈ కారు 1549 ఎంఎంతో కూడిన 13 అంగుళాల వీల్స్ వేరియంట్, 1564 ఎంఎంతో కూడిన 14 అంగుళాల వీల్స్ వేరియంట్ అందుబాటులోకి రానున్నది. 

click me!