బెస్ట్ సెల్లింగ్ కారుగా ‘ఆల్టో’.. వరుసగా 16వసారి మొదటి స్థానంలో...

By Sandra Ashok Kumar  |  First Published Jun 16, 2020, 10:38 AM IST

చిన్న కార్లలో అత్యంత ఆదరణ కల మారుతి సుజుకి ఆల్టో మోడల్ కారు విక్రయాల్లో వరుసగా 16వ ఏడాది మొదటి స్థానంలో నిలిచిందని ఆ సంస్థ ప్రకటించింది. 2019-20లో 1.48లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది.
 


న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ ఉత్పత్తుల సంస్థ మారుతీ సుజుకీకి చెందిన ఆల్టో మోడల్ కారు కార్ల విక్రయాల్లో ‘రారాజు’గా నిలిచింది. వరుసగా 16 ఏడాది బెస్ట్ సెల్లింగ్​ కారుగా నిలిచిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

చిన్న కార్లలో అత్యంత ఆదరణ గల ఆల్టో మోడల్ కారును 2019-20 మధ్యకాలంలో 1.48 లక్షల మంది కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఆల్టో మోడల్ కారును మారుతి సుజుకి  2000లో మార్కెట్​లోకి తీసుకొచ్చింది. 

Latest Videos

2004లో మొదటిసారి బెస్ట్​ సెల్లింగ్​​ కారుగా నిలిచింది. అప్పటి నుంచి దేశీయ మార్కెట్లో ఆల్టోకు తిరుగులేకుండా పోయింది. ఆల్టోకు బలమైన కస్టమర్​ బేస్​ ఉందని, ఎప్పటికప్పుడు అప్​గ్రేడ్​ చేస్తుండటంతో వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొంటున్నదని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ వెల్లడించారు. 

also read 

మైలేజీ సామర్థ్యం పెంచుతూ సరికొత్త హంగులు జోడించడం వల్లే మంచి ఆదరణ లభిస్తోందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్​ అండ్ సేల్స్​ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్​ శ్రీవాత్సవ అన్నారు. మొదటి సారి కారు కొనాలని భావించే వారిలో అత్యధికులు ఆల్టో మోడల్ వైపే మొగ్గుతారన్నారు.

‘కొత్త నిబంధనలకనుగుణంగా ప్రస్తుత ఆల్టో మోడల్​లో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్​ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ సహా అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాం. కస్టమర్ల ప్రాధాన్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నాం’ అని శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.  

2008 నాటికి 10 లక్షల కార్లు అమ్ముడు పోయాయి. తర్వాత నాలుగేళ్లకే అంటే 2012 నాటికే ఆల్టోమోడల్ కార్ల విక్రయం 20 లక్షల మైలురాయిని అధిగమించేసింది. 2019 నాటికి 38 లక్షలు అమ్ముడు పోయిన కారుగా ఆల్టో నిలిచింది. 

ఆల్టో మోడల్ కారు లక్షల మంది భారతీయుల కలలను సాకారం చేసిందని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఏళ్ల తరబడి వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొంటూనే ఉందని వెల్లడించారు. 

click me!