మూడు వరుసలతో విపణిలోకి టయోటా ‘ఆర్ఎక్స్ 450 హెచ్ఎల్’

By telugu team  |  First Published Oct 4, 2019, 1:24 PM IST

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ అనుబంధ లెక్సస్ విభాగం భారత విపణిలోకి విలాసవంతమైన ఆర్ఎక్స్ 450 హెచ్ఎల్ మోడల్ విద్యుత్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.99 లక్షలుగా నిర్ణయించింది.


టయోటా విలాసవంతమైన కార్ల తయారీ విభాగం లెక్సస్​.. దేశీయ మార్కెట్లోకి హైబ్రీడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ‘ఆర్ఎక్స్ 450 హెచ్ఎల్’ను ఆవిష్కరించింది. దీన్ని మూడు వరుసల సిట్టింగ్​ సామర్థ్యంతో రూపొందించింది. 

భారత్​ స్టేజ్-6 ఉద్గార నియమాలను పాటిస్తూ ఈ హైబ్రీడ్ వాహనాన్ని రూపొందించినట్లు లెక్సస్​ వెల్లడించింది. ఈ హైబ్రీడ్​ మోడల్​ కారు ధర రూ.99 లక్షలుగా నిర్ణయించింది లెక్సస్​. 

Latest Videos

ఈ నెల నుంచే బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు పేర్కొంది. నాలుగో తరానికి చెందిన నూతన మోడల్​లో.. ఈసారి అదనంగా మూడో వరుస సిట్టింగ్​ సామర్థ్యాన్ని పొందుపరిచింది. 3.5 లీటర్ల పెట్రోల్​ ఇంజిన్​తో ఈ మోడల్​ను రూపొందించారు.

ఇంటీరియర్‌లో న్యూ టచ్ డిస్ ప్లేతోపాటు టచ్ ఇంటర్ ఫేస్, యూఎస్బీ పోర్ట్, ప్లస్ కనెక్టివిటీ టు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్ క్లౌడ్ కనెక్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

లెక్సస్ ఇండియా అధ్యక్షుడు పీబీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆర్ఎక్స్ 450హెచ్ఎల్ సెల్ఫ్ చార్జింగ్ హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వెహికల్. లగ్జరీ, స్పేస్, క్వైట్ నెస్, క్రాఫ్ట్‌మన్ షిప్, ఇంప్రూవ్డ్ టెక్నాలజీతో రూపొందించిందన్నారు. 

click me!