ఐఆర్‌డిఎఐ కొత్త రూల్.. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే వాహన యజమానులకు చుక్కలే..

Ashok Kumar   | Asianet News
Published : Jan 21, 2021, 12:06 PM IST
ఐఆర్‌డిఎఐ కొత్త రూల్.. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే వాహన యజమానులకు చుక్కలే..

సారాంశం

 ట్రాఫిక్ ఉల్లంఘన ప్రీమియం అని పిలువబడే దీనిని వాహన భీమాలో కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టనుంది. దీని వల్ల  ట్రాఫిక్ ఉల్లంఘనలు త్వరలో వాహన యజమానులకు ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు. 

 ట్రాఫిక్ ఉల్లంఘనలు పట్టించుకోకుండా అతిక్రమిస్తున్న వాహనదారులకి  చెక్ పెట్టేందుకు భీమా రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ కొత్త రూల్స్ తీసుకురాబోతుంది.  ట్రాఫిక్ ఉల్లంఘన ప్రీమియం అని పిలువబడే దీనిని వాహన భీమాలో కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టనుంది.

దీని వల్ల  ట్రాఫిక్ ఉల్లంఘనలు త్వరలో వాహన యజమానులకు ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు. ఇది ఓన్ డ్యామేజ్,  మ్యాండేటరీ థర్డ్ పార్టీ, వ్యక్తిగత ప్రమాద ప్రీమియంతో పాటు ఉంటుంది. 

ఈ విభాగం అన్నీ వాహన భీమా కవరేజీకి జతచేయబడుతుంది. ప్రధానంగా ఓన్ డ్యామేజ్ లేదా  థర్డ్ పార్టీ భీమా అని పేర్కొంటూ వర్కింగ్ గ్రూప్ నివేదిక తెలిపింది. ట్రాఫిక్ ఉల్లంఘన ప్రీమియం అనేది  ట్రాఫిక్ ఉల్లంఘన చేసిన  వాహనం నుండి సేకరించిన పెనాల్టీ పాయింట్ల వ్యవస్థతో అనుసంధానించబడుతుంది.

also read ఇండియాలో ఈ కారు ఎంత సురక్షితమైనదో తెలుసుకోండి.. క్రాష్ టెస్ట్ లో 4 స్టార్ రేటింగ్.. ...

ఇది భీమా రెన్యూవల్ సమయంలో అమలులోకి వస్తుంది. కాకపోతే కొత్త వాహనాలకు ఇది వర్తించదు. వాహన భీమా కొనుగోలుదారులు బీమా సంస్థలను సంప్రదించినప్పుడు ఓన్ డ్యామేజ్,  థర్డ్ పార్టీ లేదా  ట్రాఫిక్ ఉల్లంఘన పాయింట్లు, చెల్లించాల్సిన ట్రాఫిక్ ఉల్లంఘన ప్రీమియంతో అంచనా వేయబడుతుంది.

 దీని అర్థం వాహన డ్రైవర్ వల్ల కలిగిన  ట్రాఫిక్ ఉల్లంఘనలకు యజమాని పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని నివేదికలో తెలిపింది.  ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలను తరుచూ ఉల్లంఘిస్తారో వారి వాహనం భీమా ప్రీమియం కూడా పెరిగిపోతుంది.

ఈ కొత్త రూల్ వల్ల మీరు ట్రాఫిక్ చలనాతో పాటు మీ వాహన భీమా ప్రీమియాన్ని అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబందించిన తుది నివేదికను ఐఆర్‌డిఎఐ సిద్ధం చేసింది. తొలిసారిగా ఈ కొత్త నిబంధనలు దేశ రాజధాని ఢిల్లీలో అమలు చేయవచ్చు.

తర్వాత దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నారు. వాహన భీమా ప్రీమియం సమయంలో గత రెండేళ్ల నాటి ట్రాఫిక్ చలానాలను పరిగణలోకి తీసుకొని మీకు ప్రీమియం నిర్ణయిస్తారు.  

ట్రాఫిక్ ఉల్లంఘన డేటాను సంగ్రహించడానికి, ప్రతి వాహనం యొక్క ట్రాఫిక్  ఉల్లంఘన పాయింట్లను లెక్కించడానికి ఐటి సిస్టమ్ ఇంటిగ్రేషన్ ద్వారా ఈ సమాచారాన్ని  బీమా సంస్థలందరికీ అందుబాటులో ఉంచడానికి ఐఐబి వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ పోలీస్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌తో సమన్వయం చేస్తుంది.  
 

PREV
click me!

Recommended Stories

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఆటోమేటిక్ vs మాన్యువల్.. ఏది బెస్ట్?
₹5.76 లక్షలకే 7 సీటర్ కార్.. మహీంద్రా, కియా బ్రాండ్లకు సవాల్