హ్యుండాయ్ మోటార్స్ ఇండియా ప్రీ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. తాజాగా విడుదల కానున్న ‘వెన్యూ’ నూతన మోడల్ కారు ఒక్క రోజులోనే 2000 బుకింగ్స్ నమోదు చేసుకున్నది.
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం ‘హ్యుండాయ్ మోటార్స్ ఇండియా’ తాజాగా మార్కెట్‌లోకి విడుదల కానున్న ‘వెన్యూ’ మోడల్ ఎస్ యూవీ కారు ప్రీ బుకింగ్స్‌లో రికార్డులు నమోదు చేస్తోంది. ఈ నెల రెండో తేదీన ‘ప్రీ- బుకింగ్స్’ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
తొలి రోజు బుకింగ్స్ 2000 కార్లు బుక్ అయ్యాయి. గంటకు 84 కార్ల చొప్పున ప్రీ బుక్ చేసుకున్నారని హ్యుండాయ్ మోటార్ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ వికాస్ జైన్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని టచ్ పాయింట్లలో కస్టమర్లు ‘వెన్యూ’ మోడల్ కారు గురించి ఎంక్వైరీ కాల్స్ చేశారు. సెమీ అర్బన్ ప్రాంతాల నుంచి ఆన్ లైన్ బుకింగ్‌లో చెప్పుకోదగిన ప్రగతి సాధించామన్నారు.
మెట్రో నగరాల నుంచి పల్లెటూర్ల వరకు స్ట్రాంగ్ టెలికం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉండటం కూడా తమకు కలిసి వచ్చిందని హ్యుండాయ్ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ వికాస్ జైన్ తెలిపారు. ఇది రోజువారీగా టెక్నాలజీ మొబిలిటీ సొల్యూషన్స్‌తో టెక్నాలజీ అనుసంధానం కావడమే కారణం అన్నారు.