హై-ఎండ్ వాహనాల కోసం పవర్ 99 హై ఆక్టేన్ ఇంధనాన్ని ప్రారంభించిన హిందూస్తాన్ పెట్రోలియం

By Sandra Ashok Kumar  |  First Published Nov 19, 2020, 12:34 PM IST

చెన్నైలోని ప్రీమియం కార్, బైకుల యజమానులకు పవర్ 99 హై ఆక్టేన్ ఇంధనం ఒక పెద్ద స్టెప్-అప్ అవుతుంది, ఎందుకంటే హై ఆక్టేన్ ఇంధనం ఇంజన్ పనితీరు మెరుగుపరుస్తుంది. 


హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) తాజాగా ప్రీమియం 'పవర్ 99' హై ఆక్టేన్ ఇంధనాన్ని చెన్నై నగరంలో ప్రవేశపెట్టింది. చెన్నైలోని ప్రీమియం కార్, బైకుల యజమానులకు పవర్ 99 హై ఆక్టేన్ ఇంధనం ఒక పెద్ద స్టెప్-అప్ అవుతుంది, ఎందుకంటే హై ఆక్టేన్ ఇంధనం ఇంజన్ పనితీరు మెరుగుపరుస్తుంది.

ప్రీమియం ఇంధనం అనేది భారతదేశంలో అత్యధిక ఆక్టేన్ పెట్రోల్. పవర్ 99 ఇంధనం ధర లీటరుకు రూ. 100 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా, ఇది పెట్రోల్ కంటే గణనీయంగా ఖరీదైనది, ఈ రోజు చెన్నైలో పెట్రోల్ ధర రూ.84.19 వద్ద రిటైల్ అవుతుంది.

Latest Videos

హెచ్‌పిసిఎల్ మొదట పవర్ 99ను  2017లో ఇండియాలో ప్రవేశపెట్టింది, పైలట్ ప్రాతిపదికన బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. తరువాత ఇది వివిధ ప్రాంతాలకు విస్తరించింది.

ప్రీమియం ఇంధనం ఇప్పుడు ఢీల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, మైసూర్, మంగళూరుతో సహా 20 ప్రధాన నగరాల్లో లభిస్తుంది. ఇంధనం ప్రతి ప్రాంతంలోని కొన్ని పెట్రోల్ స్టేషన్లకు మాత్రమే పరిమితం చేయబడింది.

also read 

పవర్ 99 గురించి హెచ్‌పిసిఎల్ రిటైల్ - సౌత్ జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ సందీప్ మహేశ్వరి మాట్లాడుతూ "ఢీల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి అనేక నగరాల్లో హై-ఎండ్ కార్ల మార్కెట్ పెరుగుతోంది.

అందువల్ల అధిక ఆక్టేన్ రేటింగ్ ఉన్న ఇంధనానికి కూడా మంచి డిమాండ్ పెరుగుతోంది. పవర్ 99 అనేది ప్రీమియం బ్రాండెడ్ పెట్రోల్. దీనికి ఆక్టేన్ రేటింగ్ 99 ఉంది, ఇది ప్రస్తుతం భారతదేశంలో అత్యధికం. పవర్ 99 ఇంజన్ పనితీరును మెరుగుపరచడమే కాక ఇంధన సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

హెచ్‌పిసిఎల్ పవర్ 99 కంప్రెషన్ స్ట్రోక్ సమయంలో ఉష్ణోగ్రత పెరుగుదలను తట్టుకోగలదని, ఇది టెయిల్ పైప్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పవర్ 99ను యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (యుఎస్ ఇపిఎ) ఆమోదించిందని కంపెనీ తెలిపింది.

హెచ్‌పిసిఎల్ దేశంలో అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలలో ఒకటి. భారతదేశం అంతటా 13,000 రిటైల్ ఇంధన బంకులు ఉన్నాయి. తమిళనాడులో మాత్రమే సుమారు 2500 రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి.  

click me!