2030కల్లా డ్రైవర్‌లెస్ ‘ఎమిరాయ్ ఎస్’ కార్లు

By Ashok Kumar  |  First Published Oct 25, 2019, 12:04 PM IST

2030కల్లా డ్రైవర్ లెస్ కార్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని జపాన్ కేంద్రంగా పని చేస్తున్న మిత్సుబిషి తెలిపింది. ఎమిరాస్ ఎస్ పేరుతో టోక్యోలో మొదలైన కార్ల ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు పెట్టింది. ఈ ఎగ్జిబిషన్ నవంబర్ నాలుగో తేదీ వరకు సాగుతుంది. ఈ కార్లలో ఏర్పాటు చేసే సెన్సర్లు అందులో ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని గమనించి వైద్యులను అలర్ట్ చేస్తాయి.


న్యూఢిల్లీ: డ్రైవర్‌ అవసరం లేకుండా సొంతంగా డ్రైవ్‌ చేసుకునే (డ్రైవర్‌లెస్‌ కార్లు‌) కార్లలో మున్ముందు మరిన్ని విప్లవాత్మక మార్పులు వస్తాయని ‘మిత్సుబిషి’ కార్ల కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) హిరోషి హోనిషి తెలిపారు. ‘కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వారేమైనా ఇబ్బంది పడుతున్నారా? గుండెపోటుకు గురయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయా? అనే విషయాలను అనుక్షణం గమనించే సెన్సర్లు అమరుస్తారు. 

సదరు సెన్సర్లు గల కార్లు 2030 నాటికి మనకు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్లలో అమర్చే సెన్సర్లు అందులో ప్రయాణించే వారి ఆరోగ్య పరిస్థితి గురించి వెంటనే వారి వైద్యులను సెల్‌ఫోన్‌ అనుసంధానం ద్వారా అప్రమత్తం చేసే సెన్సర్లు కల కార్లు  2030 నాటికి మనకు అందుబాటులోకి వస్తాయని హిరోషి తెలిపారు.

Latest Videos

also read ఇండియాలోకి న్యూ జనరేషన్ ఆడి ఎ6: ధర 54.20 లక్షలు

జపాన్‌కు చెందిన ‘మిత్సుబిషి’ కంపెనీ ‘ఎమిరాయ్‌ ఎస్‌’ పేరిట డ్రైవర్‌లెస్‌ కారును తీసుకు వస్తోంది. ఈ కారు మోడల్‌ను టోక్యోలో ప్రారంభమైన కార్ల ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు పెట్టింది. ఈ ఎగ్జిబిషన్‌ నవంబర్‌ 4వ తేదీ వరకు కొనసాగుతుంది. 

తాము ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ మోడల్‌లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారా? సుఖంగానే ప్రయాణిస్తున్నారా? అన్న అంశాలు పరిశీలించి ప్రయాణికులకనుగుణంగా డ్రైవింగ్‌ మోడ్‌ను మార్చే సెన్సర్లు ఉన్నాయని మిత్సుబిషి’ కార్ల కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) హిరోషి హోనిషి తెలిపారు.

also read కిరోసిన్... ఆల్కహాల్... తో నడిచే హైబ్రిడ్ కారు

వృద్ధులు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారు వాహనాలను నడుపుతుండడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని మిత్సుబిషి’ కార్ల కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) హిరోషి హోనిషి చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎమర్జెన్సీకి హెచ్చరించే చేసే సెన్సర్లు కూడా త్వరగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. 

దాన్నే మరింతగా అభివృద్ధి చేస్తే డాక్టర్లను అప్రమత్తం చేసేలా సాంకేతిక పరిజ్ఞానం డ్రైవర్‌లెస్‌ కార్లలో వస్తుందని మిత్సుబిషి’ కార్ల కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) హిరోషి హోనిషి ఆశాభావం వ్యక్తం చేశారు.

click me!