ఆటోమొబైల్ సేల్స్‌లో భారీ రికవరీ.. జులైలో 30% పెరిగిన వాహన విక్రయాలు..

By Sandra Ashok KumarFirst Published Aug 11, 2020, 6:07 PM IST
Highlights

చివరకు వాహన విక్రయాలు మెల్లిమెల్లిగా మెరుగుపడుతుండటంతో పునరుజ్జీవనం సంకేతాలను చూపుతోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐ‌ఏ‌ఎం) విడుదల చేసిన నెలవారీ అమ్మకాల ప్రకారం 2020 జూలైలో దేశంలో మొత్తం 14,64,133 ప్రయాణీకుల వాహనాలు అమ్ముడయ్యాయి.

భారతీయ ఆటొమొబైల్ పరిశ్రమ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా మొదటి త్రైమాసికంలో కొనుగోలు లేక లాభాలను కోల్పోయింది. చివరకు వాహన విక్రయాలు మెల్లిమెల్లిగా మెరుగుపడుతుండటంతో పునరుజ్జీవనం సంకేతాలను చూపుతోంది.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐ‌ఏ‌ఎం) విడుదల చేసిన నెలవారీ అమ్మకాల ప్రకారం 2020 జూలైలో దేశంలో మొత్తం 14,64,133 ప్రయాణీకుల వాహనాలు అమ్ముడయ్యాయి, అంతకుముందు నెలతో పోలిస్తే ఇది 30 శాతం ఎక్కువ, మొత్తంగా 11,19,048 యూనిట్లు అమ్ముడయ్యాయి.

అయితే గత ఏడాది జూలై 2019తో పోల్చితే అమ్మకాలు బాగా క్షీణించాయి. గత ఏడాది ఇదే నెలలో దేశంలో 17,01,832 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి, అంటే 14 శాతం వృద్ధి క్షీణించింది. ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 73 శాతం పెరిగి జూలైలో 182,779 యూనిట్లకు చేరుకోగా జూన్ నెలలో 105,617 యూనిట్లు నమోదు చేసింది.

also read 

ఎస్‌ఐ‌ఏ‌ఎం ప్రెసిడెంట్ రాజన్ వాధేరా మాట్లాడుతూ, “కోవిడ్-19 కారణంగా కొన్ని నెలల పాటు అమ్మకాలు క్షీణించిన తరువాత, ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాల సేల్స్ ఇప్పుడు మంచి సంకేతాలు ఇస్తున్నాయి. ఆగస్టు నెలలో అమ్మకాల సంఖ్య మెరుగ్గా ఉంటున్నట్లు సూచిస్తుంది ”.

అయితే ఎస్‌ఐ‌ఏ‌ఎం ప్రకారం బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్, టాటా మోటార్స్, వోల్వో ఆటో వంటి బ్రాండ్ల డేటా అందుబాటులో లేదు. జూన్ 2020 తో పోలిస్తే జూలైలో 2-వీలర్ల అమ్మకాలు 26% మెరుగుపడ్డాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఏ‌డి‌ఏ) ప్రకారం జూలై నెలలో మొత్తం 11,42,633 వాహనాల సేల్స్ నమోదయ్యాయి,

జూన్ 2020 లో నమోదైన వాహనాల సంఖ్య కంటే 16 శాతం ఎక్కువ. అయితే ఎఫ్‌ఏ‌డి‌ఏ ప్రకారం 2019 జూలైలో మొత్తం 17,92,879 వాహనాలు అమ్ముడుపోయాయి, అంటే గత నెలతో పోలిస్తే ఈ నెలలో 36 శాతం నెగటివ్ వృద్ధి కనిపించింది.
 

click me!