మూడు వేరియంట్లలో విపణిలోకి మారుతి ‘న్యూ’ ఎర్టిగా

By Siva KodatiFirst Published May 1, 2019, 11:40 AM IST
Highlights

ప్రయాణికుల కార్ల తయారీలో మేటి సంస్థ మారుతి సుజుకి.. తన కేటగిరీలో మరో మోడల్ కారును ఆవిష్కరించింది.

దేశీయంగా కార్లు తయారు చేస్తున్న ప్రముఖ సంస్థ మారుతీ సుజుకీ మార్కెట్లోకి సరికొత్త ఎర్టిగా కారును విడుదల చేసింది. దీనిలో కొత్తగా అభివృద్ధి చేసిన 1.5-లీటర్‌ డీడీఐఎస్‌ 225 డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చింది. ఈ కారును వీడీఐ, జెడ్‌డీఐ, జెడ్‌డీఐ ప్లస్‌ అనే మూడు వేరియంట్లలో విక్రయిస్తోంది. 

న్యూ ఎర్టిగా కారు ప్రారంభ ధర రూ.9.86లక్షలు కాగా అత్యధిక ధర రూ.11.20 లక్షలుగా పలుకుతోంది. న్యూ ఎర్టిగా మోడల్ కారులో పాత 1.3లీటర్‌ డీడీఐఎస్‌ 200 ఇంజిన్‌ స్థానంలో సరికొత్త డీడీఐఎస్‌ 225 ఇంజిన్‌ రానుంది. 

పాత ఇంజిన్‌ను ఫియట్‌ నుంచి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం మాత్రం పాత ఇంజిన్‌కు అదనంగా సరికొత్త ఇంజిన్‌ను కూడా మారుతీ ఆఫర్‌ చేస్తోంది. కొత్త డీడీఐఎస్‌ 225 1498 సీసీ ఫోర్‌ సిలిండర్‌ను కలిగి ఉంది. 

న్యూ ఎర్టిగా కారు 4000 ఆర్‌పీఎం వద్ద 94 బీహెచ్‌పీ పవర్, 1500-2500 ఆర్‌పీఎం వద్ద 225ఎన్‌ఎం టార్చ్‌ను విడుదల చేస్తుంది. దీనిలో డ్యూయల్‌ మాస్‌ ఫ్లైవీల్‌టెక్నాలజీని వాడారు.

ఇది ఇంజిన్‌, ట్రాన్స్‌మిషన్‌ మధ్య అనుసంధానం ఏర్పరిచి టార్క్‌ను సరిగా పంపిణీ అయ్యేట్లు చూస్తుంది. ఎంపీవీ సెగ్మెంట్లో అత్యధికంగా విక్రయించే వాహనంగా ‘ఎర్టిగా’రికార్డు నెలకొల్పింది. 

ఎంవీపీ విభాగంలో మారుతి ఎర్టిగా మార్కెట్‌ షేర్ 39శాతం వరకు ఉంది. మరో ఏడాదిలో డీజిల్‌ ఇంజిన్లను పక్కన పెడతామని మారుతీ ఇటీవలే ప్రకటించింది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఎర్టిగా 1.5 - లీటర్ల ఇంజిన్ సామర్థ్యంతో కూడిన న్యూ ఎర్టిగాను విడుదల చేసింది. 

ఈ ఇంజిన్‌ను భవిష్యత్‌లో తయారయ్యే పెద్ద మోడళ్లలో కూడా అమర్చే అవకాశం ఉందని మారుతీ ఛైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ తెలిపారు.  అవసరమైతే 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజీన్‌ను బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేస్తామని  మారుతీ ఛైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ వెల్లడించారు. 

click me!