బడ్జెట్ కు మీ పాకెట్ కు లింకేంటి?...

By SumaBala Bukka  |  First Published Jan 24, 2024, 10:48 AM IST

సామాన్యుడికి బడ్జెట్ ఎందుకు ముఖ్యమైనది? బడ్జెట్ తో సామాన్యుడికి ఏం లాభం కలుగుతుంది. బడ్జెట్ ఎందుకు తయారుచేస్తారు? అంటే... 


ఈసారి ఫైనాన్షియల్ అకౌంట్స్ ఎలా ఉంటాయి? సామాన్యుల బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం ఏమిటి? బడ్జెట్ నేరుగా మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? బడ్జెట్ లో ప్రభుత్వం చేసే కొత్త పాలసీలు, ప్రకటనలు సామాన్యులను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి?

బడ్జెట్.. ఈ పదం వినగానే ఆల్జీబ్రా విన్నట్టుగా ఉంటుంది. అర్థంకాదు. కానీ బడ్జెట్ ను అర్థం చేసుకోవడం చాలా సులభం. నెలకు మనకు వచ్చే జీతాన్ని బట్టి ఆ నెలంతా దేనికి ఖర్చు పెట్టాలి. అనేది ఎలాగైతే కేటాయించుకుంటామో.. దేశ బడ్జెట్ కూడా అంతే.. దేశానికి అవసరమైన వాటిని... ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేనికెంత కేటాయించాలో నిర్ణయించడమే బడ్జెట్. ఈ ప్రాథమిక విషయం అర్థం అయితే.. బడ్జెట్ ను అర్థం చేసుకోవడం తేలిక. 

Latest Videos

Budget 2024 : గత యూనియన్ బడ్జెట్‌లపై మార్కెట్ల రియాక్షన్ ఎలా ఉందంటే...

అందుకే.. సామాన్యులకు బడ్జెట్ ఎంత ముఖ్యమో దేశ ప్రభుత్వానికి అంతే ముఖ్యం. బడ్జెట్ ప్రకారం ఇల్లు నడుపుకుంటే అప్పులు కాకుండా.. ఇబ్బంది పడకుండా సాఫీగా సంసారం సాగిపోతుంది. దేశ బడ్జెట్ కూడా అలా తయారవుతుంది. కాకపోతే.. ఈ బడ్జెట్ వల్ల ఇంటి బడ్జెట్‌ మీద కూడా ప్రభావం పడుతుంది. యేటా సమర్పించే బడ్జెట్‌లో, ఉపాధి, ఆర్థిక వ్యవస్థను పెంచడంలో సహాయపడే రంగాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. అలాంటి రంగాలకే కేటాయింపులు చేస్తారు.

బడ్జెట్‌ను రూపొందించడంలో ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే, బడ్జెట్ కేటాయింపులు అత్యవరమైన చోటికే చేరుకోవాలి. అందులో సామాన్యుల కోసం సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఉంటాయి. అలాగే, బడ్జెట్‌లో ఆదాయపు పన్ను లేదా వ్యక్తిగత పన్నుకు సంబంధించిన నిబంధన కూడా ఉంది. పన్నుల విషయంలో ప్రజలకు ఎక్కడ ఉపశమనం లభిస్తుందో.. లేదా భారం ఎక్కడ పెరుగుతుందో ఇది చూపిస్తుంది.

ఆర్థిక అసమానతలు ఏ ఆర్థిక వ్యవస్థకైనా చాలా ఆందోళన కలిగించే విషయమని, అటువంటి పరిస్థితిలో, దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి ఉన్న ఏకైక అవకాశం బడ్జెట్. సంక్షేమం, ఆర్థిక విధానాల ద్వారా అసమానతలను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు బడ్జెట్ ద్వారా ఆదరణ లభిస్తుంది.

బడ్జెట్‌ సిద్ధం కాగానే ప్రభుత్వం ముందుగా బలహీనమైన ప్రాంతాలను గుర్తిస్తుంది. ఇలా గుర్తించడం వల్ల వనరుల కేటాయింపులో సహాయపడుతుంది, ఇది బడ్జెట్ చేయడానికి ప్రాథమిక కారణం. దీంతో ఎలాంటి విధానాలు అవసరం, ఏయే రంగాలు సామాన్యులకు మేలు కలిగిస్తాయనేది ప్రభుత్వం తెలుసుకోగలుగుతుంది

click me!