ఆకాశ్ అంబానీ వెడ్డింగ్ కార్డ్ ఇదే..!!

Siva Kodati |  
Published : Feb 14, 2019, 04:22 PM IST
ఆకాశ్ అంబానీ వెడ్డింగ్ కార్డ్ ఇదే..!!

సారాంశం

కూతురు ఈషా అంబానీ పెళ్లినే కార్పోరేట్ ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో ఘనంగా నిర్వహించారు రిలయన్స్ అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ. మరి అలాంటిది కొడుకు వివాహాన్ని ఏ రేంజ్‌లో చేస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

కూతురు ఈషా అంబానీ పెళ్లినే కార్పోరేట్ ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో ఘనంగా నిర్వహించారు రిలయన్స్ అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ. మరి అలాంటిది కొడుకు వివాహాన్ని ఏ రేంజ్‌లో చేస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ముకేశ్-నీతా అంబానీల కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం, ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో మార్చి 9న జియో వరల్డ్ సెంటర్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ముఖేశ్, నీతా పెళ్లి పిలుపులు మొదలుపెట్టేశారు.

కార్పోరేట్, సినిమా, రాజకీయ దిగ్గజాలకు శుభలేఖలు అందిస్తున్నారు. తొలి శుభలేఖను ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ శుభలేఖ ఎలా ఉంది. కొ

డుకు వెడ్డింగ్ కార్డ్ అంబానీల రేంజ్‌కు తగినట్లుగా ఉందా అంటూ నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. నిపుణులైన డిజైనర్ల చేత గ్రాండ్‌‌కు డిజైన్ చేయించిన ఈ వెడ్డింగ్ కార్డ్‌లో ముఖేశ్-నీతా దంపతులు స్వహస్తాలతో రాసిన లేఖ ముందుగా దర్శనిమస్తుంది.

అనంతరం వివాహానికి సంబంధి సంగీత్, మెహంది, పెళ్లి వేదిక, అతిథులకు ఇచ్చే బహుమతుల వివరాలు ఉంచారు. కృష్ణుడు, గణపతి పాటలు వెడ్డింగ్ కార్డ్ తెరిచిన తర్వాత బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తాయి. దీంతో ఈ పత్రిక కార్పోరేట్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 

 

PREV
click me!

Recommended Stories

Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !