UPI payments by credit card: యూపీఐ పేమెంట్‌కు క్రెడిట్ కార్డ్ ఉపయోగించాలని భావిస్తున్నారా, అయితే ఇది మీ కోసం

By Krishna Adithya  |  First Published Jun 8, 2023, 3:08 AM IST

 క్రెడిట్‌ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేయాలని ఉందా.. అయితే యాక్సిస్ బ్యాంక్ ఆ సౌకర్యం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 


నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో క్రెడిట్ కార్డు లావాదేవీలను ప్రోత్సహించేంుదకు  Google Pay, Paytm, Razorpayతో సహా పలు పేమెంట్ అగ్రిగేటర్‌లతో కలిసి పనిచేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూపే క్రెడిట్ కార్డ్‌లను UPIకి లింక్ చేసిన తర్వాత, ఇకపై కస్టమర్‌లు కొనుగోళ్లు చేసేటప్పుడు తమ క్రెడిట్ కార్డ్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంతకుముందు, UPI వినియోగదారులకు బ్యాంక్ ఖాతా, సేవింగ్స్ ఖాతా ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉండేవి. ఇకపై UPI QR కోడ్‌ల నెట్‌వర్క్  క్రెడిట్ కార్డ్ ఆధారిత చెల్లింపులను కూడా స్వీకరిస్తోంది. తద్వారా కార్డ్ పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్ ఉన్న సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని వ్యాపారాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 

RBI పేమెంట్స్ విజన్ 2025 ప్రకారం రాబోయే నాలుగేళ్లలో క్రెడిట్ కార్డ్ చెల్లింపు కార్యకలాపాలు ఏటా 16 శాతం పెరుగుతాయని అంచనా వేసింది. రోజువారీ లావాదేవీల కోసం డిజిటల్ చెల్లింపులు వేగంగా జరిగేందుకు క్రెడిట్ కార్డ్-UPI అనుసంధానం తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. కస్టమర్లు, వ్యాపారులకు ఇబ్బందులు లేని పేమెంట్ అనుభవాన్ని ఇది అందించగలదని భావిస్తున్నారు. 

Latest Videos

కివి యాప్ తో చేతులు కలిపిన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు
UPI ద్వారా క్రెడిట్‌ చెల్లింపులను ప్రారంభించేందుకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్లాట్‌ఫారమ్ కివితో చేతులు కలిపింది. Kiwi App RuPay క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం వన్-స్టాప్ పరిష్కారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లో డైరెక్ట్-టు-కస్టమర్ మోడల్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఇందులో కస్టమర్‌లు నేరుగా బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయవచ్చు లేదా ఫోన్ ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులను సురక్షితమైన పద్ధతిలో చేయవచ్చు.

Kiwi క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు తక్షణమే డిజిటల్ రూపే క్రెడిట్ కార్డ్ ఇవ్వనున్నారు. దీని ద్వారా వినియోగదారులు UPI, రూపే కార్డ్‌లను యాప్‌లో లింక్ చేయగలరు. UPI ఆఫర్స్,  క్యాష్‌బ్యాక్‌పై క్రెడిట్ పొందడంలో సైతం ఈ యాప్  సహాయపడుతుంది. కివి క్రెడిట్ కార్డ్ UPI అప్లికేషన్ కస్టమర్‌లకు కార్డ్ పరిమితిని సెట్ చేయడానికి, కార్డ్‌ని బ్లాక్ చేయడంతో పాటు, మరెన్నో వాటికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

కివి ఉపయోగాలు
వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కివి మొదటి UPI+ క్రెడిట్ కార్డ్. ఇది జీవిత కాల ఉచిత సర్వీసుతో పాటు, క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. Gokiwi.inకి వెళ్లి, చివరి వరకు స్క్రోల్ చేయండి, మీ మొదటి పేరు, చివరి పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. వివరాలను పూరించిన తర్వాత, మీరు లావాదేవీలపై ఫ్లాట్ 2% క్యాష్‌బ్యాక్‌కు అర్హులైన వినియోగదారుల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారని మీకు సందేశం వస్తుంది.

click me!