Lap Top Screen car: ల్యాప్ టాప్ లాంటి టచ్ స్క్రీన్ ఉన్న కారు కావాలా? బెస్ట్ 5 ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కార్లు ఇవే

Published : Jun 15, 2025, 06:56 PM IST
Lap Top Screen car: ల్యాప్ టాప్ లాంటి టచ్ స్క్రీన్ ఉన్న కారు కావాలా? బెస్ట్ 5 ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కార్లు ఇవే

సారాంశం

Lap Top Screen car: కార్ల కంపెనీలు కొత్త ఫీచర్స్ తో లేటెస్ట్ మోడల్స్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ప్రస్తుతం ట్రెండీ ఫీచర్. రూ.10 లక్షల లోపు బెస్ట్ స్క్రీన్ ఉన్న టాప్ 5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ ఇటీవల బాగా డెవలప్ అయ్యింది. ఇంతకు ముందు మ్యూజిక్ సిస్టమ్స్ అంటే చిన్న బటన్స్ ఉండేవి. 2025 లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ చాలా అడ్వాన్స్డ్ అయిపోయాయి. కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీలు పెద్ద టచ్ స్క్రీన్స్ పెడుతున్నాయి. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇప్పుడు చాలా కార్లలో కామన్ ఫీచర్ గా మారింది. 2025 లో రూ.10 లక్షల లోపు బెస్ట్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉన్న టాప్ 5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా టియాగో

టాటా టియాగో 2025 మోడల్ కొన్ని అప్డేట్స్ తో వచ్చింది. అందులో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఒకటి. ఇది XZ, XZ+ వేరియంట్స్ లో మాత్రమే ఉంటుంది. టాటా టియాగో XZ వేరియంట్ ధర రూ.7.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 

సిట్రోయెన్ C3

సిట్రోయెన్ C3 కూడా బెస్ట్ ఫీచర్స్ ని కలిగి ఉంది. ఇది ఒక మైక్రో SUV. ఈ మోడల్ లో C5 ఎయిర్‌క్రాస్ తప్ప మిగతా వేరియంట్స్‌లో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంటుంది. సిట్రోయెన్ C3 ఫీల్ వేరియంట్ నుండి టచ్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. సిట్రోయెన్ C3 ఫీల్ వేరియంట్ ధర రూ.8.53 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఎంజి కామెట్ EV

ఎంజి కామెట్ EV చాలా చౌకైన ఎలక్ట్రిక్ వెహికల్. ఇందులో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంటుంది. ఇది ఒక చిన్న హ్యాచ్‌బ్యాక్. ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి వైర్‌లెస్ కనెక్షన్ ఉంటుంది. కామెట్ EV ఎక్సైట్ వేరియంట్ నుండి 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంటుంది. ఎంజి కామెట్ EV ఎక్సైట్ వేరియంట్ స్టార్టింగ్ ధర రూ.8.93 లక్షలు. 

టాటా పంచ్

టాటా పంచ్ ఒక పాపులర్ మైక్రో SUV. టియాగో లాగే ఇందులో కూడా 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ను కలిగి ఉంది. అకంప్లిష్డ్ + వేరియంట్ నుండి ఈ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ వేరియంట్ ధర రూ.9.52 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 

టాటా ఆల్ట్రోజ్

టాటా మోటార్స్ ఇటీవలే ఆల్ట్రోజ్ కొత్త మోడల్ రిలీజ్ చేసింది. ఇందులో కూడా 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది దీని ముందు మోడల్ నుండి కంటిన్యూ అవుతోంది. ఈ ఫీచర్ క్రియేటివ్ వేరియంట్ నుండి అందుబాటులో ఉంటుంది. టాటా ఆల్ట్రోజ్ క్రియేటివ్ వేరియంట్ ధర రూ.9.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RBI Repo Rate Cut: మీకు లోన్ ఉందా, అయితే గుడ్ న్యూస్‌.. ఏ లోన్ పై ఎంత ఈఎమ్ఐ త‌గ్గుతుందో తెలుసా.?
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది