Children Mutual Funds: మీ పిల్లల చదువుకు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం చూస్తున్నారా? రెట్టింపు లాభాలనిచ్చే టాప్ చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే.

Published : Jun 17, 2025, 10:45 AM IST
Children Mutual Funds: మీ పిల్లల చదువుకు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం చూస్తున్నారా? రెట్టింపు లాభాలనిచ్చే టాప్ చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే.

సారాంశం

పిల్లల భవిష్యత్తును భద్రంగా తీర్చిదిద్దాలని మీరు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయం అవుతుంది. లాక్-ఇన్ పీరియడ్ లేదా పిల్లల మెజారిటీ వయసు వచ్చే వరకు ఉండే బెస్ట్ చిల్డ్రన్ ఫండ్ స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

ప్రతి ఒక్కరికీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. అంటే ఇల్లు కొనడం, పిల్లల ఉన్నత చదువులకు డబ్బు దాచడం, పదవీ విరమణ తర్వాత అవసరాలకు డబ్బు పొదుపు చేయడం ఇలా ప్రతి ఒక్కరికీ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి. ఇలాంటి లక్ష్యాలను సాధించాలంటే మ్యూచువల్ ఫండ్స్ సహాయపడతాయి. అందులోనూ కొన్ని సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ బాగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో బెస్ట్ ఫండ్ స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌

సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో రెండు రకాలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఫండ్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్స్. పిల్లల ఫండ్స్ లో మొత్తం 12 స్కీమ్‌లు ఉన్నాయి. వాటి మొత్తం అసెట్ అండర్ మేనేజ్మెంట్(AUM) రూ.23,523 కోట్లు. అదేవిధంగా మొత్తం 29 పదవీ విరమణ పథకాలు ఉన్నాయి. వాటి మొత్తం AUM రూ.31,006 కోట్లు.

పిల్లల మ్యూచువల్ ఫండ్స్

2025లో పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్లవైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో పిల్లల చదువుకు, వారి ఆరోగ్య అవసరాలు, ఇతర జీవిత అవసరాల కోసం పెట్టుబడులు చేయాలనుకునే వారికి బాలల కోసం రూపొందించిన ప్రత్యేక మ్యూచువల్ ఫండ్లు ఉపయోగంగా ఉంటున్నాయి. ఇందులో టాప్ 4 మ్యూచువల్ ఫండ్స్, అత్యధిక రిటర్స్ ఇచ్చే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

సాధారణంగా పిల్లల చదువుల కోసం ఆదా చేయడానికి సహాయపడే పథకాలకు కనీసం ఐదు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. గత ఐదేళ్లలో 20% కంటే ఎక్కువ వార్షిక రాబడిని ఇచ్చిన సొల్యూషన్-ఓరియెంటెడ్ (పిల్లల) మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ ఉన్నాయి.

మ్యూచువల్ ఫండ్స్5-సంవత్సరాల-రాబడి (%)
HDFC చిల్డ్రన్స్ ఫండ్21.45
ICICI ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్గిఫ్ట్ ప్లాన్ 21
టాటా యంగ్ సిటిజన్స్ ఫండ్21.54
UTI చిల్డ్రన్స్ ఎక్విటీ ఫండ్20.39

 

పైన ఉన్న టేబుల్ ను మీరు గమనిస్తే HDFC చిల్డ్రన్స్ ఫండ్ గత ఐదేళ్లలో 21.45% రాబడిని ఇచ్చింది. గత ఐదేళ్లలో 20% కంటే ఎక్కువ వార్షిక రాబడిని ఇచ్చిన ఇతర పథకాల్లో ICICI ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్ (గిఫ్ట్ ప్లాన్), టాటా యంగ్ సిటిజన్స్ ఫండ్, UTI చిల్డ్రన్స్ ఎక్విటీ ఫండ్ ఉన్నాయి.

1. HDFC చిల్డ్రన్స్ ఫండ్

ఈ ఫండ్ చదువు, పెళ్లి ఖర్చుల కోసం పెట్టుబడి చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. దీని అసెట్ అండర్ మేనేజ్మెంట్ (AUM) రూ.7,000 కోట్లు.

2. ICICI ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్

ఈ ఫండ్ మిశ్రమ మోడల్‌ను అనుసరిస్తూ ఈక్విటీతో పాటు డెబ్ట్ సెగ్మెంట్‌ల్లోనూ పెట్టుబడులు చేస్తుంది. దీని AUM సుమారు రూ.2,300 కోట్లు.

3. UTI చిల్డ్రన్స్ ఎక్విటీ ఫండ్

ఇది మంచి బ్రాండ్ వాల్యూలో ఉండే కంపెనీలపై దృష్టి పెడుతుంది. ఈ ఫండ్ AUM రూ.900 కోట్లు.

రూ.లక్షకు రూ.2 లక్షలకు పైగా ఆదాయం

ఈ గణాంకాలను సరిగ్గా అర్థం చేసుకుంటే పైన ఉన్న ఏ పెట్టుబడి స్కీమ్ లో అయినా CAGR (సంయుక్త వార్షిక వృద్ధి రేటు) సంవత్సరానికి 20% రాబడితో పెరిగింది. అంటే వీటిల్లో మీరు రూ.1 లక్ష పెట్టుబడి పెడితే రూ.2.48 లక్షలు అవుతుందన్న మాట. అంటే ఈ కాలంలో అది రెట్టింపు లాభానికి పైగా ఆదాయాన్ని ఇచ్చింది. ఇది కేవలం కాంపౌండింగ్ ప్రభావం వల్లే జరిగింది. అందువల్ల పిల్లల భవిష్యత్తు కోసం ఆదా చేయాలనుకొనే వారికి ఇలాంటి చైల్డ్ కేర్ ఫండ్ స్కీమ్స్ మంచి రిటర్స్ ఇస్తాయి. 

పెట్టుబడి పెట్టేముందు ఇది గుర్తుపెట్టుకోండి

చారిత్రక రాబడి ఫ్యూచర్ ఇన్‌కమ్ కు ఎప్పటికీ హామీ ఇవ్వదు. అంటే ఒక పథకం గతంలో అసాధారణ రాబడిని ఇచ్చిందని చెప్పడం, అది భవిష్యత్తులో కూడా మంచి రాబడిని ఇస్తుందని కాదు. పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు SEBI రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌తో మాట్లాడి లాభనష్టాలు ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Insurance Scheme: రోజుకు 2 రూపాయ‌ల‌తో రూ. 2 ల‌క్ష‌లు పొందొచ్చు.. వెంట‌నే అప్లై చేసుకోండి
మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు