Todays Petrol Diesel Prices: నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే.. స్థిరంగా 73 రోజులు..!

By team teluguFirst Published Jan 17, 2022, 9:02 AM IST
Highlights

ప్ర‌భుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 17, 2022) ధరలను విడుదల చేశాయి. వరుసగా 73 రోజులు ధరల్లో మార్పులేదు. రెండు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు మార్పులేదు. 

ప్ర‌భుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 17, 2022) ధరలను విడుదల చేశాయి. వరుసగా 73 రోజులు ధరల్లో మార్పులేదు. రెండు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు మార్పులేదు. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. ఇటీవలే జార్ఖండ్ ప్రభుత్వం టూవీలర్స్‌కు లీటర్ పెట్రోల్ పైన రూ.25 తగ్గింపును అమలు చేసింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.


ఢిల్లీ పెట్రోలు ధర  లీటరుకు రూ. 95.41, డీజిల్ లీటరుకు రూ. 86.67

చెన్నై పెట్రోలు ధర  లీటరుకు రూ. 101.40, డీజిల్ ధర   లీటరుకు రూ. 91.43

కోల్‌కతా పెట్రోలు ధర  లీటరుకు రూ. 104.67, డీజిల్ ధర  లీటరుకు రూ. 89.79

త్రివేండ్రం పెట్రోలు ధర  లీటరుకు రూ. 106.36, డీజిల్ ధర లీటరుకు రూ. 93.47

హైదరాబాద్ పెట్రోలు ధర లీటరుకు రూ. 108.20, డీజిల్ ధర లీటరుకు రూ. 94.62

బెంగళూరు పెట్రోలు ధర లీటరుకు రూ. 100.58, డీజిల్ ధర లీటరుకు రూ. 85.01

జైపూర్ పెట్రోలు ధర  లీటరుకు రూ. 107.06, డీజిల్ ధర  లీటరుకు రూ. 90.70

లక్నో పెట్రోలు ధర లీటరుకు రూ. 95.28, డీజిల్ ధర లీటరుకు రూ. 86.80

భువనేశ్వర్ పెట్రోలు ధర లీటరుకు రూ. 101.81, డీజిల్ ధర లీటరుకు రూ. 91.62

ఒమిక్రాన్ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి. భారీగా పెరుగుతూ, అంతేస్థాయిలో పడిపోతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే ఇటీవల ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత పది పదిహేను సెషన్లలో దాదాపు 10 డాలర్లు పెరిగింది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం చమురు మార్కెట్ పైన ఉంటోంది. వినియోగం తగ్గుతుందనే భయంతో చమురు ధరలు ప్రారంభంలో పడిపోయాయి. ఆ తర్వాత భారీగా పెరిగాయి. ఆగస్ట్ నెల నుండి ఓ వారంలో గరిష్ట పెరుగుదలను గత నెలలో నమోదు చేశాయి. ఓ విధంగా ఊగిసలాటలో ఉన్నాయి. అయితే కొత్త క్యాలెండర్ ఏడాదిలో మాత్రం పెరుగుతున్నాయి. ఇటీవల భారీగా పెరిగింది. నేడు బ్రెంట్ క్రూడ్ ధర 86.45 డాలర్ల వద్ద, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 83.78 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయంగా ఇలాగే స్థిరంగా పెరిగితే మన వద్ద ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి.

click me!