August: ఆగస్టు నెల వచ్చేస్తోంది...ఈ నెలలో మీ జేబుపై భారం పెంచబోతున్న మార్పులు ఇవే..ముందే జాగ్రత్త పడండి..

Published : Jul 28, 2022, 01:08 PM IST
August: ఆగస్టు నెల వచ్చేస్తోంది...ఈ నెలలో మీ జేబుపై భారం పెంచబోతున్న మార్పులు ఇవే..ముందే జాగ్రత్త పడండి..

సారాంశం

ఆగస్టు ప్రారంభానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నాయి. కాబట్టి ఆగస్టు నెలలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అవి సామాన్య పౌరుడిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడం ముఖ్యం.

ఆగస్టుల నెల ప్రారంభం కాగానే ఆర్థికంగా మీ ఖర్చులపై మార్పులు రావడం సహజం. ఎందుకంటే ఆర్థికంగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో మార్పుల కారణంగా మన జేబులపై నేరుగా ప్రభావం చూపనుంది. ఆగస్టు నెలలో అనేక పండుగల కారణంగా బ్యాంకులకు మొత్తం 18 రోజులు సెలవులు ఉన్నాయి. కాబట్టి ఆగస్టులో బ్యాంకుకు వెళ్లి ఏదైనా పని ఉంటే సెలవుల జాబితాను ఒక్కసారి చూసుకుంటే మంచిది. ప్రతి నెల మాదిరిగానే ఆగస్టు ప్రారంభంలో కూడా ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆగస్టులో వచ్చే ప్రధాన మార్పులు ఏమిటో తెలుసుకుందాం. 

బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్ చెల్లింపు వ్యవస్థ
మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతా ఉంటే, మీరు తప్పకుండా ఈ నియమం గురించి తెలుసుకోవాలి. ఆగస్టు 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్ ద్వారా చెల్లింపు నిబంధనలలో మార్పులు ఉంటాయి. RBI మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 1 నుండి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5 లక్షలు. చెక్కు చెల్లింపు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో నూతన చెల్లింపు విధానం అమలు చేయబడుతుంది. పాజిటివ్ పే అనేది చెక్ క్లియరింగ్ సిస్టమ్‌ అమల్లోకి రానుంది. దీని కింద చెక్ జారీ సమయంలో ఖాతాదారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బ్యాంక్ చెల్లింపు కోసం చెక్కులను పంపుతుంది. ఈ విధానంలో చెక్కు క్లియర్ కావాలంటే, దాన్ని జారీ చేసిన వ్యక్తి ముందుగానే బ్యాంకుకు కొంత సమాచారం ఇవ్వాలి. చెక్ నంబర్, చెక్ తేదీ, చెల్లింపుదారు పేరు, ఖాతా సంఖ్య, చెల్లించాల్సిన మొత్తం మొదలైనవి ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంకింగ్ అప్లికేషన్‌లోకి లాగిన్ చేయడం ద్వారా పాజిటివ్ పే ప్రక్రియలను కూడా పూర్తి చేయవచ్చు. 

ఎల్‌పిజి సిలిండర్ ధర మార్పు
ప్రతి నెలా మొదటి తేదీన ఎల్‌పిజి సిలిండర్ ధరను మార్చడం సాధారణం. అలాగే ఆగస్టు 1న కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధరలో మార్పు ఉండే అవకాశం ఉంది. ఈసారి కంపెనీలు గృహ, వాణిజ్య అవసరాల కోసం ఎల్‌పిజి సిలిండర్ల ధరలను మార్చే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో సిలిండర్ ధర రూ.30 నుంచి రూ.40 ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అప్పటి వరకు మారే అవకాశం ఉంది. జూలైలో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 50 పెంపుదల జరిగింది. అయితే, 19 కిలోల ఎల్‌పిజి వాణిజ్య సిలిండర్ (వాణిజ్య సిలిండర్) ధర రూ.8.50 తగ్గించారు. 

బ్యాంకులకు సుదీర్ఘ సెలవు దినాలు..
ఆగస్టు అంటే పండుగల నెల. మొహర్రం, రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి. అదనంగా, ఆదివారాలు, రెండవ మరియు నాల్గవ శనివారాలు సహా మొత్తం 18 రోజులు బ్యాంకులు మూసివేయనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RBI Repo Rate Cut: మీకు లోన్ ఉందా, అయితే గుడ్ న్యూస్‌.. ఏ లోన్ పై ఎంత ఈఎమ్ఐ త‌గ్గుతుందో తెలుసా.?
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది