19 ఏళ్ల యువకుడు నూనూగు మీసాల కుర్రాడు.. ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి ఏకంగా 1200 కోట్లు వెనకేసుకున్నాడు. ప్రస్తుతం అతని సక్సెస్ స్టోరీ యువతకు విజయ సూత్రంలా నిలుస్తోంది ఇంతకీ ఎవరా కుర్రాడు ఏంటా వ్యాపారం ఏంటా విజయ సూత్రం తెలుసుకుందాం.
కొంత మంది యువకులు రాబోవు యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు అన్నాడు మహా కవి శ్రీశ్రీ...ఇక్కడ మనం చెప్పుకోబోయే ఓ యువకుడు కూడా అలాంటి కోవకు చెందిన వాడే ముంబైకి చెందిన కైవల్య ఓహ్రా అనే యువకుడు. ఈ కుర్రాడి వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. 2001 సంవత్సరంలో జన్మించిన ఈ మిలినియల్ యువకుడు ఏకంగా రూ. 7300 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంతేకాదు రూ. 1200 కోట్ల విలువైన సంపదను వెనకేసుకున్నాడు. ఇంత చిన్న వయసులో, ఇంత తక్కువ సమయంలో వేలకోట్లకు అధిపతి ఎలా అయ్యాడు అని నెట్టింట చర్చ కొనసాగుతోంది. కైవల్య సక్సెస్ స్టోరీ ప్రస్తుతం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. అనే మాట కైవల్య జీవితంలో అక్షరాలా నిజమైంది.
చిన్న వయస్సులోనే ఏమాత్రం అనుభవం లేకపోయినా, కైవల్య ఇంత సక్సెస్ సాధించడం వెనక ఉన్న కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముంబైలో జన్మించిన కైవల్య అక్కడే తన స్కూలింగ్ ను పూర్తి చేస్తున్నాడు. అనంతరం అమెరికాకు వెళ్లి ప్రఖ్యాత యూనివర్సిటీ అయినా స్టాన్ ఫర్డ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు. ఉన్నత విద్యాభ్యాసం అలా పూర్తయిందో లేదో వెంటనే ఇండియాకు వచ్చేసి, తన కలను సొంతం చేసుకునే పనిలో పడ్డాడు.
తన మిత్రుడు అదిత్ పలిచాతో కలిసి కైవల్య 17 ఓ స్టార్టప్ ప్రారంభించాడు, దాని పేరు గోపూల్. ఇక కాలేజీలో తమ విద్యాభ్యాసం కొనసాగుతున్నప్పుడే జెప్టో పేరిట ఓ ఆన్లైన్ డెలివరీ ప్లాట్ ఫారం ను ప్రారంభించాడు. గతంలో అప్పటివరకు ఉన్నటువంటి డెలివరీ యాప్స్. సరుకులను కస్టమర్లకు చేరవేయడానికి రెండు రోజుల సమయం తీసుకుంటున్నాయి. దీన్ని గమనించిన కైవల్య తాను ప్రారంభించిన జప్టో ద్వారా కేవలం పది నిమిషాల్లోనే కస్టమర్ ముందు సరుకులు డెలివరీ చేస్తానని మాట ఇచ్చాడు. 2021 లో ప్రారంభించిన జెప్టో నెమ్మదిగా విస్తరించింది.
సంవత్సరం తిరిగేలోగా జెప్టో వ్యాల్యుయేషన్ సుమారు 7300 కోట్లకు చేరింది. ఇక కైవల్య సంపద సైతం 1200 కోట్లకు చేరింది. ఈ సంపదతో కైవల్య దేశంలోనే యంగెస్ట్ మిలియనీర్గా అవతరించారు. జెప్టో కంపెనీ వై కాంబినేటర్, బ్లేడ్ బుక్ క్యాపిటల్ నుంచి 60 మిలియన్ డాలర్ల ఫండింగ్ పొందడం విశేషం. ప్రస్తుతం ఈ కంపెనీలో 1000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు అలాగే 10 పెద్ద నగరాల్లో ఈ కంపెనీ విస్తరించింది ప్రస్తుతం కైవల్య ఈ కంపెనీ సిటిఓ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.