Teslas Shanghai Plant: చైనాలో ఎలాన్ మ‌స్క్‌కు భారీ షాక్‌..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : May 10, 2022, 02:52 PM IST
Teslas Shanghai Plant: చైనాలో ఎలాన్ మ‌స్క్‌కు భారీ షాక్‌..!

సారాంశం

ఎన్నో ఆశలతో చైనాలో టెస్లా కార్ల తయారీ కర్మాగారం స్థాపించిన ఎలాన్‌ మస్క్‌కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సప్లై చెయిన్‌ సమస్యలతో షాంఘైలోని టెస్లా గిగా ఫ్యాక్టరీ మరోసారి మూత పడినట్టు సమాచారం. నెల రోజుల వ్యవధిలో టెస్లా ఫ్యాక్టరీ మూత పడటం ఇది రెండోసారి.  

ఎంతో మంది పోటీ పడ్డా అందర్ని అదిగమించి ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్‌.  ఇప్పుడు ఆసక్సెస్‌ను మాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ట్వీట్టర్ పై మోజుతో అవసరానికి మించి పెట్టుబడి పెట్టిన మస్క్.. నిధుల సమీకరణ కోసం టెస్లా షేర్లను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. ట్వీట్టర్‌ కొనుగోలు చేశారని వార్తలు వెలువడిన వెంటనే టెస్లా షేర్లు దారుణంగా పతనమయ్యాయి. మరోవైపు ట్వీట్టర్‌కు డబ్బులు కట్టాల్సిన తేదీ దగ్గరపడడంతో భారీ నష్టాలను టెస్లా షేర్లను అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మస్క్‌కు చైనా గట్టి షాక్ ఇచ్చింది. 

పెట్టుబడులకు స్వర్గధామం అయిన చైనాలో ఎలాన్ మస్క్‌ కూడా  పెట్టుబడులు పెట్టారు. తన టెస్లా కార్ల తయారీ కర్మాగారాన్ని  స్థాపించారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన చైనా ప్లాంట్‌ వరుసగా వస్తున్న సమస్యలతో ఉత్పత్తిని కొనసాగించలేకపోతోంది. సప్లై చెైన్‌ సమస్యల కారణంగా షాంఘైలోని టెస్లా గిగా ఫ్యాక్టరీ మరోసారి మూత పడింది.  నెల రోజుల వ్యవధిలో టెస్లా ఫ్యాక్టరీ రెండవ సారి మూతపడడంతో మస్క్ తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. 

ఏషియా మార్కెట్‌పై కన్నెసిన ఎలాన్‌ మస్క్‌.. వ్యూహాత్మకంగా చైనాలో పెట్టుబడులు పెట్టారు. చైనా కమర్షియల్ క్యాపిటల్ అయిన షాంఘై దగ్గర్లో బిలియన్‌ డాలర్లు వెచ్చింది టెస్లా గిగా ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఇక్కడ తయారు చేసిన టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లు ఆసియా దేశాలకు సప్లై చేస్తున్నారు. అయితే చైనాలో పెట్టుబడులు పెట్టకముందు ఉన్న పరిస్థితి ఆతర్వాత మారిపోయింది. చైనాలో తయారైన ఉత్పత్తులపై భారత్‌ భారీగా సుంకాలు విధిస్తోంది.  దీంతో ప్రపంచంలో రెండో పెద్ద మార్కెటైన ఇండియాలో మస్క్ తక్కువ లాభాలతో  వ్యాపారం చేయాల్సి వస్తోంది. 

చైనా ఉత్పత్తులపై భారత్ ట్యాక్స్‌లు గణనీయంగా పెంచేసిన కొంత కాలానికే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇక్కట్ల పాలు చేయడం ప్రారంభించింది. అప్పటికే మార్కెటింగ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మస్క్‌ను కరోనా దారుణంగా నష్టాల పాలు చేసింది. షాంఘైలో డ్రాగన్ సర్కారు విధించిన లాక్‌డౌన్ చాలా కాలం పాటు కొనసాగడంతో టెస్లా భారీగా నష్టపోయింది. కరోనా కారణంగా అప్పట్లో  ఈ గిగా ఫ్యాక్టరీ 22 రోజుల పాటు షట్‌డవున్‌ అయింది. షాంఘైలో పరిస్థితి కొంత మెరుగు అవడంతో 2022 ఏప్రిల్‌ 19 తిరిగి ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమైంది. 

అయితే ఆతర్వాత లాక్‌ డౌన్ ఎత్తేసినా.. కరోనా కరాణంగా సప్లై వ్యవస్థ చిన్నాభిన్నం అవడంతో.. ముడి వస్తువుల కొరత కారణంగా ఉత్పత్తి ఆగిపోయింది. ఇలా చాలం కాలం పాటు ఇబ్బంది పడ్డ గిగా ఫ్యాక్టరీ తిరిగి మళ్లీ తెరుచుకునే నాటికి చైనాలో మళ్లీ కరోనా విస్తరించింది. దీంతో గిగా ఫ్యాక్టరీని మరోసారి మూసేశారు. దీంతో మస్క్ కు  మళ్లీ నష్టాలు తప్పడం లేదు. అసలే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న మస్క్‌ను ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వెంటాడుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?