బిస్లరీకి కొత్త బాస్‌గా జయంతి చౌహాన్.. టాటాతో చర్చలు ముగిసిన తర్వాత కంపెనీ నిర్ణయం..

Published : Mar 20, 2023, 06:31 PM IST
బిస్లరీకి కొత్త బాస్‌గా జయంతి చౌహాన్.. టాటాతో చర్చలు ముగిసిన తర్వాత కంపెనీ నిర్ణయం..

సారాంశం

42 ఏళ్ల జయంతి చౌహాన్, ప్రస్తుతం ఆమె తండ్రి ప్రమోట్ చేసి నిర్మించిన బిస్లెరీ ఇంటర్నేషనల్ కంపెనీకి వైస్-ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తుల ప్రకారం, ఆమె చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆన్జెలో జార్జ్ నేతృత్వంలోని ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి పని చేస్తుంది.

బిస్లరీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ రమేష్ చౌహాన్ కుమార్తె జయంతి చౌహాన్ ఇప్పుడు బాటిల్ వాటర్ కంపెనీకి సారథ్యం వహించనున్నారు. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL)తో కొనుగోలు చర్చలు ముగిసిన తర్వాత, జయంతికి నాయకత్వాన్ని అప్పగించాలని కంపెనీ నిర్ణయించిందని వివరించారు. జయంతి చౌహాన్ మా ప్రొఫెషనల్ టీమ్‌తో కంపెనీని నడుపుతారని,  మేము మా వ్యాపారాన్ని విక్రయించకూడదని బిస్లరీ చైర్మన్ రమేష్ చౌహాన్ మీడియాకు తెలిపారు.

ప్రస్తుతం బిస్లెరీ ఇంటర్నేషనల్ కంపెనీ వైస్ చైర్‌పర్సన్‌గా జయంతి చౌహాన్  ఉన్నారు.  టాటా కన్స్యూమర్ బిస్లరీతో రెండు సంవత్సరాల క్రితం చర్చలు ప్రారంభించింది, అయితే గత వారం చర్చలను విరమించుకోవాలని నిర్ణయించుకుంది.

ఆమె చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆన్జెలో జార్జ్ నేతృత్వంలోని ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి పని చేస్తుంది. 82 ఏళ్ల రమేష్ చౌహాన్ ఈ బ్రాండ్‌ను టాటా గ్రూప్‌కు రూ.7,000 కోట్లకు విక్రయించేందుకు గతంలో అంగీకరించారు. అయితే, "అనిశ్చితస్థితి" కారణంగా టాటా కన్స్యూమర్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది.

జయంతి చౌహాన్ బాల్యం
హై స్కూల్ తర్వాత, జయంతి చౌహాన్ లాస్ ఏంజిల్స్‌లోని FIDM (ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్)లో ప్రాడక్ట్  డేవలప్మెంట్ అభ్యసించింది. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ నుండి ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీని కూడా అభ్యసించారు. ఆమె ఎన్నో ప్రముఖ ఫ్యాషన్ హౌస్‌లలో ఇంటర్న్‌గా కూడా పనిచేశారు. ఆమె స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS), యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి అరబిక్ కూడా నేర్చుకున్నారు.  

చిన్న  వయస్సులో
జయంతి తన తొలినాళ్లలో బిస్లరీ ప్లాంట్ పునరుద్ధరణ, ప్రాసెస్ ఆటోమేషన్‌పై దృష్టి సారించింది. కంపెనీ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ (హెచ్‌ఆర్)తో పాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో గణనీయమైన మార్పులు చేశారు. 2011లో జయంతి ఢిల్లీ నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది. హిమాలయాస్ నేచురల్ మినరల్ వాటర్, ఫిజీ ఫ్రూట్ డ్రింక్స్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైర్స్ వ్యాపారం వంటి బిస్లరీ కొత్త బ్రాండ్‌లను నడపడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

PREV
click me!

Recommended Stories

Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!