Renault Duster: కారు ప్రియులకు గుడ్ న్యూస్: టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ మళ్లీ వచ్చేస్తున్నాయ్..

Published : Jun 03, 2025, 09:30 PM IST
Renault Duster

సారాంశం

ఒకప్పుడు స్ట్రాంగ్, లాంగ్ కార్లకు బ్రాండ్ గా నిలిచిన టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ మళ్లీ మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయ్. ఈ సారి న్యూ లుక్, సూపర్ ఫీచర్లతో అడుగు పెట్టనున్నాయ్. కారు ప్రియులకు ఇష్టమైన ఈ కార్ల గురించి లేటెస్ట్ సమాచారం తెలుసుకుందామా?

ఒకప్పుడు ఇండియన్ రోడ్ల మీద హవా కొనసాగించిన టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ కొత్తగా మళ్ళీ వస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీ, పవర్‌ఫుల్ ఇంజిన్లతో మార్కెట్లోకి వస్తాయి. సియెర్రా 2025లో, డస్టర్ 2026లో లాంచ్ అవుతాయని సమాచారం. ఈ కార్ల కొత్త ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి. 

టాటా సియెర్రాలో కొత్త ఫీచర్లు ఇవే..

గత జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా మోటార్స్ సియెర్రా ప్రొడక్షన్-రెడీ వెర్షన్‌ను ఆవిష్కరించింది. కొత్త సియెర్రా పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో వస్తుంది. పెట్రోల్ వెర్షన్ 1.5 లీటర్ టర్బో, డీజిల్ వెర్షన్ 2.0 లీటర్ టర్బో ఇంజన్లతో వస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ. వరకు వెళ్తుంది. సియెర్రా ఐసిఈ అట్లాస్ ప్లాట్‌ఫామ్‌పై, సియెర్రా ఈవీ జెన్ 2 ఆర్కిటెక్చర్‌పై తయారవుతుంది.

సీట్ల ఆప్షన్ కస్టమర్ల చేతుల్లోనే..

కొత్త సియెర్రా 4, 5 సీటర్ ఆప్షన్లలో వస్తుంది. కస్టమర్లు తమకు కావాల్సిన మోడల్ ని ఎంచుకొనేందుకు వీలుగా ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు టాటా కంపెనీ ప్రకటించింది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ స్పెషల్ ఎట్రాక్షన్. అంతేకాకుండా 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, లెవల్ 2 ADAS వంటి అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి.

 

రెనాల్ట్ డస్టర్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూపులు

రెనాల్ట్ డస్టర్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే అప్పట్లో ఈ కారు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. ఈ కారు ఉన్న వాళ్లు చాలా గొప్ప అన్న విధంగా ఉండేది. దీనికి తోడు డస్టర్ లో ఫీచర్లు కారు నడిపే వారికే కాదు.. కూర్చున్న వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే డస్టర్ ను సెకండ్స్ లో కొనేందుకు చాలా మంది ఇప్పటికీ ప్రయత్నిస్తుంటారు. 

రెనాల్ట్ డస్టర్ ఫీచర్లు ఇవే..

హ్యుండై క్రెటా, మారుతి గ్రాండ్ విటారా లాంటి కార్లతో పోటీ పడేందుకు రెనాల్ట్ కొత్త డస్టర్‌ను 2026లో లాంచ్ చేస్తోంది. 1.0L, 1.3L టర్బో పెట్రోల్ ఇంజన్లతో పాటు హైబ్రిడ్ వెర్షన్ కూడా వస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. ADAS, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, 7-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?