Skoda Slavia: కొత్త కారు కొనాలని చూస్తున్నారా..స్కోడా నుంచి స్లావియా విడుదల ధర, ఫీచర్లు ఇవే..

By Krishna AdithyaFirst Published Apr 17, 2023, 12:27 AM IST
Highlights

కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. స్కోడా నుంచి మిడ్ సైజ్ సెడాన్ కారు స్లావియా మార్కెట్లో విడుదల అయింది. ఈ కారు అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లో దుమ్ములేపుతోంది. ఈ కారు ధర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

చెక్‌కు చెందిన లగ్జరీ ఆటోమేకర్ స్కోడా నుండి మిడ్-సైజ్ సెడాన్ అయిన స్కోడా స్లావియా భారతీయ మార్కెట్లో విజయవంతంగా తన  మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా  కంపెనీ తన మొదటి వార్షికోత్సవ ఎడిషన్‌ను ప్రారంభించింద. ఇందులో భాగంగా స్కోడా స్లావియా యానివర్సరీ ఎడిషన్ విడుదల చేసింది. ఇది 1.5L, 4-సిలిండర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ (6-స్పీడ్) , DCT ఆటోమేటిక్ (7-స్పీడ్) గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 1.5L మాన్యువల్ వెర్షన్ ధర రూ.17.28 లక్షలు కాగా, ఆటోమేటిక్ మోడల్ ధర రూ.18.68 లక్షలు ఎక్స్-షోరూమ్ గా ఉంది. 

ప్రత్యేక ఎడిషన్‌లో క్రోమ్ రిబ్స్‌తో కూడిన క్వాడ్రా గ్రిల్, డోర్ ప్యానెల్‌లపై దిగువ క్రోమ్ ట్రిమ్, టెయిల్‌గేట్ , సి-పిల్లర్‌పై డైనమిక్ యానివర్సరీ ఎడిషన్ గ్రాఫిక్స్ ఉన్నాయి. ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్‌తో పాటు, కార్‌మేకర్ సెడాన్ మోడల్ లైనప్‌లో కొత్త లావా బ్లూ కలర్ స్కీమ్‌ను పరిచయం చేసింది. ఇది బ్రిలియంట్ సిల్వర్, టోర్నాడో రెడ్, క్రిస్టల్ బ్లూ, కార్బన్ స్టీల్, క్యాండీ వైట్, టోర్నాడో రెడ్, క్రిస్టల్ బ్లూ విత్ బ్లాక్ రూఫ్, కార్బన్ స్టీల్ విత్ బ్లాక్ రూఫ్ అనే ఏడు కలర్ వేరియంట్స్ తో అందుబాటులో ఉంది. 

స్కోడా స్లావియా యానివర్సరీ ఎడిషన్ యానివర్సరీ ఎడిషన్ స్టీరింగ్ బ్యాడ్జ్, స్పెషల్ యానివర్సరీ ఎడిషన్ స్కఫ్ ప్లేట్, కార్బన్ పిల్లోస్‌తో వస్తుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో . ఆపిల్ కార్‌ప్లేతో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 380-వాట్ ఆడియో సిస్టమ్‌ను అందిస్తుంది.

8.0 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సింగిల్ పేన్ సన్‌రూఫ్, సబ్‌ వూఫర్, ఆటో డిమ్మింగ్ IRVM, MyScoda కనెక్టెడ్ కార్ టెక్, కనెక్టెడ్ కార్ టెక్, Leatherette అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హైట్ అడ్జస్ట్ మెంట్ చేయగలిగిన డ్రైవర్ సీటు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా,  హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా ఫీచర్లలో ఉన్నాయి.

స్కోడా స్లావియా సెడాన్ మోడల్ లైనప్ 1.0L, 3-సిలిండర్ TSI పెట్రోల్ ఇంజన్‌తో 115bhp,  175Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనికి రెండు గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. 6-స్పీడ్ మాన్యువల్,  6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. సెడాన్ 1.0L, 1.5L వెర్షన్లు వరుసగా 19.47kmpl (MT)/18.07kmpl (AT) , 17.8kmpl (MT)/18.4kmpl (AT)  మైలేజీ అందిస్తాయి.

click me!