గౌతమ్ అదానీకి షాక్: ఒక్కరోజులో 50 వేల కోట్ల నష్టం.. టాప్-10 జాబితాలో 6వ స్థానానికి..

Ashok Kumar   | Asianet News
Published : May 12, 2022, 01:24 PM IST
గౌతమ్ అదానీకి షాక్: ఒక్కరోజులో 50 వేల కోట్ల నష్టం.. టాప్-10 జాబితాలో 6వ స్థానానికి..

సారాంశం

 బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ 108 బిలియన్లకు చేరింది. గత 24 గంటల్లో అదానీ సంపద 6.42 బిలియన్ డాలర్లు (రూ. 49 వేల 600 కోట్లకు పైగా) తగ్గింది.

ఆసియాలోనే అత్యంత సంపన్న భారతీయ పారిశ్రామికవేత్త గౌతం అదానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం అతని నికర విలువపై ప్రభావం చూపింది. దీంతో ఇప్పుడు ప్రపంచ టాప్ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ ఆరో స్థానానికి పడిపోయాడు.  

6.42 బిలియన్ల డాలర్ల నష్టం
ఒక నివేదిక ప్రకారం, గౌతమ్ అదానీ నికర విలువ బుధవారం 108 బిలియన్ల డాలర్లకు చేరింది. అంటే 6.42 బిలియన్ డాలర్లు (రూ. 49 వేల 600 కోట్లకు పైగా) తగ్గుదల నమోదైంది. ఇంత భారీ నికర విలువ తగ్గుదల కారణంగా టాప్ బిలియనీర్ల జాబితాలో చాలా కాలంగా ఐదో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయాడు. మంగళవారం ఒక్కరోజే అతని నికర విలువ 5.19 బిలియన్ డాలర్లు తగ్గింది. 

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీలు అదానీ విల్మార్, అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పోర్ట్స్ షేర్లు మంగళవారం, బుధవారం కూడా క్షీణించడం గమనించదగ్గ విషయం. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి నుంచి 34 శాతానికి చేరాయి. దీంతో అదానీ ఆస్తులపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. 

వారెన్ బఫెట్ మళ్లీ యూ‌ఎస్ ఐదవ సంపాన్న పెట్టుబడిదారుడు అయ్యాడు. ఇప్పుడు గౌతమ్ అదానీని అధిగమించి ఐదవ స్థానానికి చేరుకున్నాడు. అయితే వారెన్ బఫెట్ కూడా 185 మిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూశాడు. అయితే ఈ నష్టం గౌతమ్ అదానీ కంటే చాలా తక్కువ. వారెన్ బఫెట్ నికర విలువ ప్రస్తుతం 113 బిలియన్ల డాలర్లు. 

ఎలోన్ మస్క్ 
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్‌కు బుధవారం ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా పతనాన్ని ఎదుర్కొంటున్న ఎలోన్ మస్క్ భారీ లాభాలను ఆర్జించాడు. అతని నికర విలువ 2.89 బిలియన్ల డాలర్లు పెరిగి 232 బిలియన్ల డాలర్లకు చేరుకుంది.  

PREV
click me!

Recommended Stories

Car Loan: న్యూ ఇయ‌ర్‌లో కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? త‌క్కువ వ‌డ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులివే
Business Idea: ఈ బిజినెస్ ఐడియా గురించి తెలిస్తే మ‌తిపోవాల్సిందే.. సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా బ‌లాదూర్ అంటారు