Ruchi Soya Rebrand: రుచి సోయా పేరు మార్పు.. ఇకపై పతంజలి ఫుడ్స్‌..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 12, 2022, 10:56 AM IST
Ruchi Soya Rebrand: రుచి సోయా పేరు మార్పు.. ఇకపై పతంజలి ఫుడ్స్‌..!

సారాంశం

వంట నూనెల దిగ్గజ కంపెనీ రుచి సోయా ఇకపై పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌గా మార్కెట్లోకి రానుంది. ఈ మేరకు కంపెనీ పేరు మార్పునకు నిర్ణయించినట్టు రుచి సోయా ప్రకటించింది. ఏప్రిల్ 10న జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. 

పతంజలికి చెందిన ప్రముఖ వంట నూనెల తయారీ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్ పేరు మారబోతోంది. ఈ సంస్థ బీఎస్ఈకి ఈ విషయాన్ని తెలియజేసింది. ఏప్రిల్ 10న జరిగిన సమావేశంలో బోర్డు కూడా పేరు మార్పునకు అంగీకారం తెలిపిందని వెల్లడించింది. దీంతో ఇకపై రుచి సోయా కంపెనీ పేరు పతంజలి ఫుడ్స్‌గా మారొచ్చు. ‘బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ పేరును పతంజలి ఫుడ్స్‌గా (లేదా అందుబాటులో ఉన్న ఇతర పేరు) మార్చాలని నిర్ణయించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ముంబై, మహారాష్ట్ర వర్తించేలా నిబంధనలను అనుగుణంగా పేరు మార్పు ఉంటుంది’ అని రుచి సోయా వివరించింది.

పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఫుడ్ పోర్ట్‌ఫోలియోతో కలిసి పూర్తి స్థాయిలో పని చేయడానికి అందుబాటులో ఉన్న ఆప్షన్లను అన్వేషించడానికి బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత లావాదేవీకి సంబంధించి నిబంధనలు, షరతులు చర్చించడానికి, వాటిని ఖరారు చేయడానికి, అమలు చేయడానికి కంపెనీ అధికారులకు బోర్డు అధికారం ఇచ్చింది. కాగా రుచి సోయా కంపెనీ ఇటీవలనే ఎఫ్‌పీవోకు వచ్చింది. 3.6 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. 4.89 కోట్ల ఈక్విటీ షేర్లకు గానూ 17.56 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి. ఈ ఇష్యూలో రిటైల్ వాటా 35 శాతంగా ఉంది. ఇది 90 శాతం సబ్‌స్క్రిప్షన్ అయ్యింది. ఈ కంపెనీ మార్చి 24న ఎఫ్‌పీవోను ప్రారంభించింది. రూ.4,300 కోట్లు సమీకరించింది. పబ్లిక్ ఆఫర్ ప్రైస్ బాండ్ రూ.615 - రూ.650 మధ్యలో ఉంది.

కాగా రుచి సోయా కంపెనీ గత వారం కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ రుణాలను పూర్తిగా చెల్లించినట్లు వెల్లడించింది. రూ.2,925 కోట్ల లోన్స్ క్లియర్ చేసినట్లు తెలిపింది. అంటే కంపెనీ రుణ రహిత సంస్థగా ఆవిర్భవించింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా వచ్చిన నిధులను కంపెనీ ఈ విధంగా రుణాలు చెల్లించడానికి ఉపయోగించుకుంది. పతంజలి ఆయుర్వేద్ ఎండీ ఆచార్య బాలకృష్ణ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.రుచి సోయా కంపెనీ బ్యాంకుల కన్సార్షియం దగ్గరి నుంచి రుణం పొందింది. దీనికి ఎస్‌బీఐ సారథ్యం వహిస్తోంది. ఈ కన్సార్షియంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. కాగా పతంజలి కంపెనీ 2019లో రుచి సోయా సంస్థను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.4350 కోట్లు. దివాల ప్రక్రియలో భాగంగా పతంజలి ఈ కంపెనీని కొనుగోలు చేసింది.

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు