అధికవడ్డీ వసూలు చేసే లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ హెచ్చరిక.. వాటి మాయలో పడోద్దంటు విజ్ఞప్తి..

By S Ashok KumarFirst Published Dec 23, 2020, 6:51 PM IST
Highlights

వ్యక్తులు, చిన్న వ్యాపారులు అనధికారిక డిజిటల్ లోన్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్స్ ద్వారా  ఇబ్బంది లేని పద్ధతిలో రుణాలు పొంది సమస్యలకు గురవుతున్నట్లు నివేదికలు వచ్చాయి" అని ఆర్‌బిఐ తెలిపింది.

ముంబై: అధిక వడ్డీ వసూలు చేసే అనధికార డిజిటల్ లోన్ యాప్‌లపై  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బుధవారం ప్రజలను హెచ్చరించింది.

వ్యక్తులు, చిన్న వ్యాపారులు అనధికారిక డిజిటల్ లోన్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్స్ ద్వారా  ఇబ్బంది లేని పద్ధతిలో రుణాలు పొంది సమస్యలకు గురవుతున్నట్లు నివేదికలు వచ్చాయి" అని ఆర్‌బిఐ తెలిపింది.

ప్రజాలు ఇటువంటి అనధికారిక కార్యకలాపాలకు బలైపోవద్దని, ఆన్‌లైన్ ద్వారా లేదా మొబైల్ యాప్స్ ద్వారా రుణాలు అందించే వాటిని నమ్మొద్దని హెచ్చరించింది. ఈ యాప్ లు అధిక వడ్డీ, అదనపు ఛార్జీలను వసూలు చేస్తాయి. అలాగే ఆమోదయోగ్యం కాని అధిక రికవరీ పద్ధతులను అవలంబిస్తాయి. రుణగ్రహీతల మొబైల్ ఫోన్‌లలో డేటాను యాక్సెస్ చేసి దుర్వినియోగం చేస్తాయి.

also read 

అంతేకాకుండా వినియోగదారులు వారి వ్యక్తిగత వివరాలు, పత్రాలు తెలియని వ్యక్తులు, ధృవీకరించని లేదా అనధికార యాప్స్ లో ఎప్పుడూ పంచుకోకూడదు అని తెలిపింది. ఎవరైనా ఇటువంటి యాప్ లతో మోసపోతే వెంటనే (https: / /sachet.rbi.org.in)  వెబ్‌సైట్‌లో ఆన్-లైన్ ఫిర్యాదు చేయాలని  సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

ఆర్‌బిఐ, ఎన్‌బీఎఫ్‌సికి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలి, కానీ ఎటువంటి నియమ నిబంధనలు పాటించని యాప్స్ వద్ద రుణాలు తీసుకోవద్దని కోరారు.  

 అభిషేక్ మక్వానా అనే రచయిత గత నెలలో చనిపోవడానికి కారణం లోన్ యాప్ ద్వారా రుణం తిరిగి చెల్లించినందుకు వేధింపులకు గురైనట్లు అతని కుటుంబం ఆరోపించింది. 

"రిజర్వ్ బ్యాంక్‌లో నమోదు చేసుకున్న ఎన్‌బిఎఫ్‌సిల పేర్లు, చిరునామాలను, ఆర్‌బిఐచే నియంత్రించబడే సంస్థలపై ఫిర్యాదులు దాఖలు చేసే పోర్టల్‌ను https://cms.rbi.org.in ద్వారా పొందవచ్చు" అని  తెలిపింది.
 

click me!