Reliance Industries Share: ఆల్ టైం రికార్డును తాకిని రిలయన్స్ షేర్ ధర..ఇంకా 20 శాతం పెరిగే చాన్స్..

Published : Apr 21, 2022, 12:19 PM IST
Reliance Industries Share: ఆల్ టైం రికార్డును తాకిని రిలయన్స్ షేర్ ధర..ఇంకా 20 శాతం పెరిగే చాన్స్..

సారాంశం

Reliance Industries Share: రిలయన్స్ షేర్ ధర ఆల్ టైం రికార్డును తాకింది. గడిచిన ఏడాది కాలంలో ఈ షేరు ధర 46.08 శాతం పెరిగింది. ఇక గడిచిన 5 ఏళ్లలో అయితే ఏకంగా 300 శాతం పెరిగింది. ఇదిలా ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ రాబోయే కాలంలో తన వ్యాపారాలను మరింత విస్తరించడంతో పాటు, కొత్త పెట్టుబడులపై ఫోకస్ పెంచనుంది. ఈ నేపథ్యంలో షేర్ ధర భవిష్యత్తులో మరో 20 శాతం పెరిగే చాన్స్ ఉందని ప్రముఖ బ్రోకరేజీ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. 

కార్పోరేట్ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, వరుసగా ట్రేడింగ్ సెషన్లలో మంచి వృద్ధిని సాధిస్తున్నాయి. RIL నేడు దాదాపు 2 శాతం లాభపడి రూ. 2777కి చేరుకుంది, ఇది 1 సంవత్సరంలో సరికొత్త గరిష్ట స్థాయిగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటి వరకు 15 శాతం, ఒక సంవత్సరంలో 45 శాతం లాభపడింది. RIL ఔట్‌లుక్‌కి సంబంధించి బ్రోకరేజ్ హౌస్‌లు చాలా బుల్లిష్‌గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎనర్జీ అప్‌సైకిల్ ప్రయోజనాన్ని కంపెనీ పొందుతోంది. 

న్యూ ఎనర్జీ ఇనిషియేటివ్
బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ, న్యూ ఎనర్జీ ఇనిషియేటివ్ కింద RIL ఇప్పటివరకు 10,900 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. 3 సంవత్సరాలలో ఈ రంగంలో 75000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంటే ఇది సరైన దారిలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో, RIL తన టెలికాం, రిటైల్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ వ్యాపారాల విలువ నిరంతరం పెరుగుతోంది. 2880 రూపాయల లక్ష్యంతో బ్రోకరేజ్ హౌస్ స్టాక్‌లో పెట్టుబడి సలహా ఇచ్చింది.

గ్లోబల్ బ్రోకరేజ్ హౌస్ మోర్గాన్ స్టాన్లీ రూ. 3253 లక్ష్యంతో స్టాక్‌లో పెట్టుబడి సలహా ఇచ్చింది. సంస్థ  బలమైన Outlook దృష్టిలో ఉంచుకుని, లక్ష్యాన్ని పెంచడం జరిగింది. ఇంతకుముందు బ్రోకరేజ్ స్టాక్‌పై రూ. 2926 టార్గెట్‌ను కలిగి ఉంది. ఇది ప్రస్తుత ధర కంటే 20 శాతం ఎక్కువ. గ్రీన్ హైడ్రోజన్ స్పేస్‌లో కంపెనీ బాగా పనిచేస్తుందని బ్రోకరేజ్ చెబుతోంది.

అదే సమయంలో, ఈ రంగంలో అగ్రగామి సంస్థ కావడం వల్ల, సంస్థ గరిష్ట ప్రయోజనాన్ని పొందవచ్చు. బ్రోకరేజ్ హౌస్ గోల్డ్‌మన్ సాక్స్ కూడా రూ.3200 లక్ష్యంతో స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని సూచించింది. నివేదిక ప్రకారం, సంస్థ పాత ఇంధన వ్యాపారంలో నగదు ప్రవాహం బలంగా ఉంది, ఇది కొత్త ఇంధన వ్యాపారం కాపెక్స్‌ను సులభతరం చేస్తుంది.

ఫలితాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు
బ్రోకరేజ్ హౌస్ ICICI Direct కూడా స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తూ రూ. 2950 టార్గెట్ ఇచ్చింది. కంపెనీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయని బ్రోకరేజీ భావిస్తోంది. నివేదిక ప్రకారం, RIL సంస్థ EBITDA వార్షిక ప్రాతిపదికన 66.3 శాతం పెరిగి రూ. 38824.5కి చేరుకోవచ్చు. ఇది QoQ ఆధారంగా 30.7 శాతం వృద్ధిని చూపగలదని అంచనా వేశారు. జియో, రిటైల్ వ్యాపారం నుండి కూడా మంచి పనితీరు కనిపిస్తుంది.

టారిఫ్ పెంపు కారణంగా, Jio నెలవారీ ARPU త్రైమాసిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి రూ.164కి చేరుకోవచ్చు. Jio స్వతంత్ర ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 6.4 శాతం పెరిగి రూ.20,581 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే EBITDA 8.1 శాతం పెరిగి 10,288 కోట్లకు చేరుకోవచ్చు. EBITDA మార్జిన్ 80 bps QoQ పెరిగి 50 శాతానికి చేరుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు