మీరు కూడా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసి మర్చిపోయారా? అయితే ఇలా వడ్డితో తిరిగి పొందండి..

Published : Jul 27, 2022, 04:05 PM IST
మీరు కూడా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసి మర్చిపోయారా?  అయితే ఇలా వడ్డితో తిరిగి పొందండి..

సారాంశం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం, 2020-21 సంవత్సరంలో బ్యాంక్ ఖాతాలలో ఉన్న మొత్తం అన్‌క్లెయిమ్ చేయని మొత్తం రూ. 39,264 కోట్లు, ఇప్పుడు 2021-22 సంవత్సరంలో రూ.48,262 కోట్లకు పెరిగింది. 

ప్రపంచం మొత్తం మాంద్యం ప్రమాదంలో ఉంది. భారతదేశంలో కూడా ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నా దేశంలోని బ్యాంకుల్లో వేలకోట్ల రూపాయలు నిరుపయోగంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ డబ్బు చెందాల్సిన నిజమైన  వారికి బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. ఆర్‌బీఐ డేటా ప్రకారం, దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లోని  ఖాతాల్లో క్లెయిమ్ చేయని డబ్బు అత్యధికంగా ఉంది. ఈ ఎనిమిది రాష్ట్రాల్లో తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బీహార్ మరియు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం, 2020-21 సంవత్సరంలో బ్యాంక్ ఖాతాలలో ఉన్న మొత్తం అన్‌క్లెయిమ్ చేయని మొత్తం రూ. 39,264 కోట్లు, ఇప్పుడు 2021-22 సంవత్సరంలో రూ.48,262 కోట్లకు పెరిగింది. ఇప్పుడు ఈ డిపాజిట్ల నిజమైన హక్కుదారులను కనుగొనడానికి RBI ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. 

క్లెయిమ్ చేయని మొత్తం ఎలా నిర్ణయించబడుతుంది?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా నుండి పదేళ్లపాటు డిపాజిట్ లేదా విత్ డ్రా చేయకపోతే ఆ ఖాతాలో ఉన్న మొత్తాన్ని అన్‌క్లెయిమ్ చేయని డబ్బుగా పరిగణిస్తారు. అదేవిధంగా పదేళ్ల పదవీకాలం తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై క్లెయిమ్ చేయకపోతే  దానిని కూడా క్లెయిమ్ చేయని డబ్బు కేటగిరీలో ఉంచబడుతుంది. 

ఖాతాలో వడ్డీ
రిజర్వ్ బ్యాంక్ RBI ప్రకారం దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఉన్న ఈ అన్‌క్లెయిమ్ మొత్తానికి వడ్డీ చెల్లించడం కొనసాగుతుంది.  ఈ మొత్తాన్ని  కలిగిన వ్యక్తులు లేదా వారిపై ఆధారపడిన వ్యక్తులు సంబంధిత బ్యాంకులకు వెళ్లి ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా వారి ఖాతా తిరిగి తెరవబడుతుంది ఇంకా వారు డిపాజిట్ చేసిన మొత్తాన్ని వడ్డీతో పొందుతారు. అప్పుడు వారు ఆ డిపాజిట్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోగలుగుతారు. 

హక్కుదారులను కనుగొనడానికి RBI ప్రచారం
ఇప్పుడు ఇలాంటి అన్‌క్లెయిమ్ ఖాతాల హక్కుదారులను కనుగొనడానికి RBI ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా అన్‌క్లెయిమ్ చేయని నిధులు పెరుగుతున్నాయని, వాటి అసలు హక్కుదారులు బయటకు రావడం లేదని ఆర్‌బీఐ చెబుతోంది. ఇప్పుడు వాటిని తెరపైకి తీసుకురావడానికి బ్యాంకులు దీనిపై ప్రజలకు మరోసారి అవగాహన కల్పిస్తాయి.

PREV
click me!

Recommended Stories

RBI Repo Rate Cut: మీకు లోన్ ఉందా, అయితే గుడ్ న్యూస్‌.. ఏ లోన్ పై ఎంత ఈఎమ్ఐ త‌గ్గుతుందో తెలుసా.?
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది