RBI Slaps Penalty: ఆ బ్యాంక్‌కు ఆర్‌బీఐ 27.50 లక్షల రూపాయల పెనాల్టీ.. ఎందుకంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 05, 2022, 11:55 AM ISTUpdated : Jun 05, 2022, 11:56 AM IST
RBI Slaps Penalty: ఆ బ్యాంక్‌కు ఆర్‌బీఐ 27.50 లక్షల రూపాయల పెనాల్టీ.. ఎందుకంటే..?

సారాంశం

నిబంధనల ఉల్లంఘనకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా విధించింది. నాన్ కంప్లయన్సెస్ విషయంలో మార్గదర్శకాలను పాటించనందుకు వివిధ నిబంధనలు పాటించకపోవడంతో  పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ పెనాల్టీ విధించింది. 

బ్యాంకింగ్ కార్యకలాపాలు దారి తప్పకుండా ఉండటానికి రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని ఏ మాత్రం ఉల్లంఘించినా.. దానికి అనుగుణంగా పెనాల్టీలను విధిస్తుంటుంది. ఖాతాదారులకు అందించాల్సిన సేవలు, ఫిర్యాదుల పరిష్కారం, డిపాజిట్స్, లాకర్స్, సెక్యూరిటీస్ విషయంలో విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటుంది ఆర్‌బీఐ. పొరపాట్లను ఏ మాత్రం ఉపేక్షించదు.

పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ విషయంలో ఇదే చోటు చేసుకుంది. నాన్ కంప్లయన్సెస్ విషయంలో మార్గదర్శకాలను పాటించనందుకు ఆర్బీ భారీ పెనాల్టీ విధించింది. దీని విలువ 27.50 లక్షల రూపాయలు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రుణాల విషయంలో ఆర్‌బీఐ 2019 అక్టోబర్ 1వ తేదీన కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రిటైల్ లోన్స్ ఫ్లోటింగ్ రేట్, ఫ్లోటింగ్ రేట్ లోన్స్‌‌‌కు కొన్ని నిర్దుష్ట నిబంధనలను రూపొందించింది.

దీన్ని ఉల్లంఘించినందుకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ 27.50 లక్షల రూపాయల మేర పెనాల్టీ విధించింది. ఈ విషయంలో ఇదివరకే షోకాజ్ నోటీసులను జారీ చేసింది. బ్యాంక్ యాజమాన్యం నుంచి సంతృప్తికరమైన రిప్లై రాలేదు. దీనిపై వ్యక్తిగతంగా కూడా విచారణ జరిపించింది. అయినప్పటికీ- సరైన కారణాలను వెల్లడించడంలో బ్యాంక్ విఫలమైంది. దీనితో ఆర్‌బీఐ చర్యలకు దిగింది. ఏకంగా 27.5 లక్షల రూపాయల మేర పెనాల్టీ విధించింది. 

రెగ్యులేటరీ రూపొందించిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు చోటు చేసుకోకపోవడం, వాటిల్లో లోపాలు, బ్యాంక్- తన ఖాతాదారులకు చెందిన ఏదైనా లావాదేవీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి ఉల్లంఘనల అంశాల్లో ఆర్‌బీఐ కఠినంగా ఉంటుంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ విషయంలో ఇవే పొరపాట్లు జరిగినట్లు విచారణ సందర్భంగా నిర్ధారణకు వచ్చింది. ఆయా కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈ పెనాల్టీ విధించినట్లు వెల్లడించింది. పెనాల్టీ విధించిన తరువాత కూడా ఇలాంటి పొరపాట్లే మళ్లీ, మళ్లీ చోటు చేసుకుంటే.. దీని తీవ్రత మరింత అధికంగా ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !