ఏడాది గడుస్తున్నా దిగిరాని ఇంధన ధరలు.. సామాన్యులకు నేటికీ భారంగా పెట్రోల్ డీజిల్.. ప్రస్తుతం లీటరు ధర ఇలా..

By asianet news teluguFirst Published May 29, 2023, 9:50 AM IST
Highlights

చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCs) నోటిఫికేషన్ ప్రకారం బెంగళూరు, కోల్‌కతా, చెన్నై ఇంకా ముంబైలో పెట్రోల్ ధరలు రూ. 100 మార్కు కంటే అధికంగా  ఉన్నాయి. OMCలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన   ధరలను అప్‌డేట్ చేస్తాయి.
 

నేడు 29 మే 2023న  అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలో మార్పు కనిపిస్తుంది. ప్రస్తుతం బ్యారెల్‌కు 75 డాలర్లకు పైనే ఉంది. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $77.59 డాలర్ల వద్ద, WTI క్రూడ్ బ్యారెల్‌కు $73.41 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీంతో మే నెల పూర్తి కావస్తున్నా సామాన్యులకు పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఊరట లభించడం లేదు. దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు పెట్రోల్, డీజిల్  తాజా ధరలను ప్రకటించాయి. దింతో నేటికీ వీటి  ధరల్లో ఎలాంటి మార్పు లేదు.   

మహారాష్ట్రలో  పెట్రోల్ సగటు ధర రూ.106.90కి అమ్ముడవుతోంది. నిన్న అంటే 28 మే 2023 నుండి మహారాష్ట్రలో ధరలో ఎలాంటి మార్పు లేదు.  కాగా డీజిల్  సగటు ధర రూ.93.49 వద్ద ఉంది.  

చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCs) నోటిఫికేషన్ ప్రకారం బెంగళూరు, కోల్‌కతా, చెన్నై ఇంకా ముంబైలో పెట్రోల్ ధరలు రూ. 100 మార్కు కంటే అధికంగా  ఉన్నాయి. OMCలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన   ధరలను అప్‌డేట్ చేస్తాయి.

ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోలు ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర  రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర  రూ.106.31, డీజిల్ ధర  రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర  లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో పెట్రోల్‌ ధర  రూ.102.63, డీజిల్‌ ధర  రూ.94.24కు  విక్రయిస్తున్నారు.

గౌతమ్ బుద్ నగర్ (నోయిడా-గ్రేటర్ నోయిడా)లో పెట్రోల్ ధర రూ.96.79గా ఉండగా, డీజిల్ ధర  లీటర్ రూ.89.96గా ఉంది. లక్నోలో పెట్రోల్ ధర రూ.96.57గా ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర  లీటరు రూ.97.18గా ఉంది. అయితే, హర్యానా రాజధాని నగరంలో డీజిల్ లీటర్ ధర  రూ. 90.05గా ఉంది. హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.66.  డీజిల్ ధర రూ. 97.82 లీటరుకి.

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్,  డీజిల్ ధరలను సమీక్షించి  నిర్ణయిస్తాయి. ఇది రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.
 

click me!