Petrol Diesel Prices Today: స్థిరంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. మీ నగరంలో లీటరు ధర ఎంతంటే..?

Published : May 29, 2022, 08:34 AM IST
Petrol Diesel Prices Today: స్థిరంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. మీ నగరంలో లీటరు ధర ఎంతంటే..?

సారాంశం

మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వచ్చి క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.  

ప్రతిరోజూ లాగానే ప్రభుత్వ చమురు కంపెనీలు ఈరోజు (ఆదివారం) ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. మే 29, 2022న కూడా జాతీయ మార్కెట్‌లో వాహన ఇంధనం (పెట్రోల్, డీజిల్) ధరలో ఎటువంటి మార్పు లేదు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. 

అంతకుముందు మే 21న నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు లీటరు భారీగా దిగొచ్చింది. భారతీయ చమురు సంస్థ IOCL  తాజా అప్ డేట్ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 29 మే 2022న లీటరు పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి ఆదివారం (మే 29, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా ఆదివారం కూడా ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.    7799658100

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.72 కాగా, డీజిల్‌ రూ. 89.62 వద్ద కొనసాగుతోంది.
 
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 111.35 కాగా, డీజిల్‌ రూ. 97.28గా ఉంది.
 
- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.63 కాగా, డీజిల్ రూ. 94.24గా నమోదైంది. 

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.94 కాగా, డీజిల్‌ రూ. 87.89 వద్ద కొనసాగుతోంది.
 
- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.03 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 92.76గా ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.66 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 97.82గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.03కాగా, డీజిల్‌ రూ. 99.74గా ఉంది.

భారతదేశం ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అవసరాలపై ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు. మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Independence Day: 1947 vs 2026.. ఉద్యోగాల వేట ఎలా మారింది? ఏఐ దెబ్బకు ఏ ఉద్యోగాలు పోతున్నాయి?
Cars Under 5 Lakhs: రూ.5 లక్షల లోపు కారు కొనాలనుకుంటే అదిరిపోయే మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవిగో