Petrol-Diesel Price Today:పెట్రోల్, డీజిల్ ధరల అప్ డేట్.. హైదరాబాద్‌లో నేడు లీటరు ధర ఎంతంటే..?

Published : Jul 29, 2022, 09:38 AM IST
Petrol-Diesel Price Today:పెట్రోల్, డీజిల్ ధరల అప్ డేట్.. హైదరాబాద్‌లో నేడు లీటరు ధర ఎంతంటే..?

సారాంశం

గురువారం మార్కెట్‌లో సాఫ్ట్ గా ఉంది, కానీ అర్థరాత్రి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌కు 0.8% పెరిగి $ 108కి చేరుకుంది. US WTI క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 1.1% పెరిగి $97.51 వద్ద ఉన్నాయి. 

ఈరోజు అంటే శుక్రవారం 29 జూలై 2022న పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నేటికీ దేశీయంగా చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా క్రూడాయిల్ ధర బలపడుతోంది. జూన్-జూలైలో తగ్గుదల కనిపించినప్పటికీ ఏప్రిల్ నుండి ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి. సాఫ్ట్ డాలర్, సప్లయి ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం ప్రారంభంలోనే ముడి చమురు ధరలు పెరిగాయి. 

గురువారం మార్కెట్‌లో సాఫ్ట్ గా ఉంది, కానీ అర్థరాత్రి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌కు 0.8% పెరిగి $ 108కి చేరుకుంది. US WTI క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 1.1% పెరిగి $97.51 వద్ద ఉన్నాయి. వరుసగా రెండో వారం బ్రెంట్ క్రూడ్ ఒక వారంలో 5 శాతం లాభాన్ని నమోదు చేయబోతోంది. WTI కూడా ఈ వారం 3 శాతం పెరుగుదలను నమోదు చేయవచ్చు.

నగరం    పెట్రోల్    డీజిల్
ఢిల్లీ    96.72    89.62
కోల్‌కతా    106.03    92.76
ముంబై    106.35    94.28
చెన్నై    102.63    94.24
నోయిడా    96.79    89.96
లక్నో    96.79    89.76
పాట్నా    107.24    94.04
జైపూర్    108.48    93.72

హైదరాబాద్‌లో పెట్రోల్  లీటరుకు రూ.109.66, డీజిల్ రూ.97.82

 మీరు  పెట్రోల్ డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ సిటీ కోడ్‌ని 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ను 9223112222 నంబర్‌కు, HPCL కస్టమర్లు HPPrice అండ్ వారి సిటీ కోడ్‌ని టైప్ చేసి 9222201122 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!