todays fuel prices:పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. ప్రముఖ నగరాల్లో ఇంధన ధరలను ఇక్కడ చూడండి..

Published : Aug 02, 2022, 09:36 AM IST
todays fuel prices:పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. ప్రముఖ నగరాల్లో ఇంధన ధరలను ఇక్కడ చూడండి..

సారాంశం

ఎక్సైజ్ సుంకం తగ్గించడానికి ముందు ఢిల్లీలో పెట్రోలు ధర లీటర్ రూ. 105.41 నుండి ప్రస్తుతం రూ. 96.72 వద్ద  ఉంది, డీజిల్ ధర రూ. 96.67 నుండి రూ. 89.62కి చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 నుండి రూ. 106.31కి, డీజిల్ ధర రూ. 97.28 నుండి రూ. 94.27కి తగ్గింది.  

 ఈరోజు పెట్రోల్ , డీజిల్ ధరలను అంటే ఆగస్టు 2న  దేశీయ చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. మహారాష్ట్ర మినహా దేశవ్యాప్తంగా 69 రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోలుపై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన మే 21 నుండి ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

ఎక్సైజ్ సుంకం తగ్గించడానికి ముందు ఢిల్లీలో పెట్రోలు ధర లీటర్ రూ. 105.41 నుండి ప్రస్తుతం రూ. 96.72 వద్ద  ఉంది, డీజిల్ ధర రూ. 96.67 నుండి రూ. 89.62కి చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 నుండి రూ. 106.31కి, డీజిల్ ధర రూ. 97.28 నుండి రూ. 94.27కి తగ్గింది.

దేశంలోని ప్రముఖ నగరాల్లో ఇంధన ధరలు

ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర  లీటరుకు రూ. 94.27

ఢిల్లీలో  పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62

చెన్నైలో  పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24

కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76

బెంగళూరులో పెట్రోలు ధర లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర లీటరుకు రూ. 87.89

లక్నోలో  పెట్రోలు ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76

హైదరాబాద్ పెట్రోలు ధర లీటరుకు రూ. 109.66, డీజిల్ ధర లీటరుకు రూ. 97.82

ముడి చమురు ధర
యుఎస్, చైనా అండ్ జపాన్‌తో సహా వివిధ దేశాల డేటా బలహీనమైన తయారీ కార్యకలాపాలను చూపించిన తరువాత మంగళవారం ఉదయం ముడి చమురు ధరలు మరోసారి తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 29 సెంట్లు తగ్గి బ్యారెల్ $99.74 వద్ద ట్రేడవుతున్నాయి. రాయిటర్స్ ప్రకారం, WTI క్రూడ్ బ్యారెల్ $ 93.67 వద్ద 22 సెంట్లు తగ్గింది. 

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !