ఏడాది గడిచిన సామాన్యులకు నో రిలీఫ్.. దిగిరాని పెట్రోల్, డీజిల్.. నేటికీ లీటరు ధర ఎంతంటే..?

By asianet news telugu  |  First Published Jun 1, 2023, 9:35 AM IST

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరలను సమీక్షించి, కొత్త ధరలు జారీ చేస్తారు. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇంకా ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు డీజిల్‌ ఇంత ఎక్కువగా ఉండటానికి  ఇదే కారణం.


న్యూఢిల్లీ: క్రూడాయిల్ ధరల్లో హెచ్చుతగ్గుల మధ్య ఇండియన్ ఆయిల్ కంపెనీలు (IOCL) పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి. దింతో వీటి ధరల్లో నేటికీ ఎలాంటి మార్పు లేదు. ప్రముఖ  మెట్రో నగరాలలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. కొన్ని నగరాల్లో  ధరలు పెరగగా, కొన్ని చోట్ల తగ్గాయి. పాట్నాలో పెట్రోల్ ధర 88 పైసలు తగ్గింది. ఇది కాకుండా నోయిడాలో కూడా పెట్రోల్ ధర 13 పైసలు తగ్గింది.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరలను సమీక్షించి, కొత్త ధరలు జారీ చేస్తారు. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇంకా ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు డీజిల్‌ ఇంత ఎక్కువగా ఉండటానికి  ఇదే కారణం.

Latest Videos

క్రూడాయిల్ ధర
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్  ధర బ్యారెల్‌కు $75 డాలర్ల దిగువకు పడిపోయింది. ఈ ఉదయం (జూన్ 1) బ్రెంట్ క్రూడ్  ఆయిల్ ధర బ్యారెల్‌కు $72.66డాలర్లుగా నమోదైంది. అదే సమయంలో, WTI క్రూడ్ బ్యారెల్‌కు $ 67.94గా ఉంది. అయితే దీని తర్వాత కూడా భారత మార్కెట్‌లో చమురు ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. 

మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు (గురువారం) లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా కొనసాగుతున్నట్లు ఐఓసీఎల్ వెల్లడించింది. దీనితో పాటు, దేశ ఆర్థిక రాజధాని ముంబై గురించి మాట్లాడితే ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకి రూ. 94.27 వద్ద స్థిరంగా ఉంది. అంతేకాకుండా, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76. 

బీహార్ రాజధాని పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ .107.24 , డీజిల్ ధర రూ .94.04. లక్నోలో పెట్రోల్ ధర  రూ .96.57, డీజిల్ ధర లీటరుకు రూ .89.76. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర  రూ .101.94 , డీజిల్ ధర  రూ .87.89 గా ఉంది.

నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర  రూ .96.79 , డీజిల్ ధర  రూ .89.96 కి చేరింది .

 ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర  రూ .96.34 , లీటర్ డీజిల్‌ ధర  రూ .89.52 .

 గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ ధర  రూ .97.18 , డీజిల్ ధర  రూ .90.05 గా ఉంది .

 హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.66.  డీజిల్ ధర రూ. 97.82 లీటరుకి.

click me!