Infinix నుంచి అతి తక్కువ ధరకే లాప్‌టాప్, నేటి నుంచి ఆన్‌లైన్ సేల్ ప్రారంభం, 10 గంటల బ్యాటరీ బ్యాకప్‌

By Krishna AdithyaFirst Published Feb 24, 2023, 1:06 PM IST
Highlights

అతి తక్కువ ధరకే లాప్టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు వెంటనే మార్కెట్లోకి అతి త్వరలోనే విడుదల కానున్న Infinix InBook Y1 Plus లాప్ టాప్ ఫీచర్లు, ధరలు, డిస్కౌంట్ ఆఫర్లను తెలుసుకుందాం.

తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసే ఇన్ఫినిక్స్ కంపెనీ మిడ్-రేంజ్‌లో కొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. Infinix నుంచి సరికొత్త Infinix InBook Y1 Plus కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. Intel Core i3 ప్రాసెసర్ భారీ ఫుల్ HD డిస్ ప్లేతో పాటు అనేక  మంచి ఫీచర్లతో వస్తుంది. Infinix InBook Y1 Plus ల్యాప్‌టాప్ సేల్ ఈరోజు, ఫిబ్రవరి 24న ప్రారంభమవుతుంది.ఈ లాప్ టాప్ పై రూ. 2000 ప్రారంభ  తగ్గింపు ఆఫర్  కూడా అందుబాటులో ఉంది. 

Infinix InBook Y1 Plus ధర
సరికొత్త Infinix  ల్యాప్‌టాప్ బ్లూ, గ్రే, సిల్వర్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో విడుదల అవుతోంది. అదే సమయంలో, ఇది రెండు ర్యామ్,  స్టోరేజ్ వేరియంట్‌లతో మార్కెట్లోకి వస్తుంది. దీని 8GB LPDDR4X RAM ,  128GB వేరియంట్ ధర రూ.29,990 ,  256GB వేరియంట్ ధర రూ.32,990గా నిర్ణయించారు.  

Infinix InBook Y1 Plus ఫీచర్లు
ఈ ల్యాప్‌టాప్ Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ల్యాప్‌టాప్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 50WHr బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది ల్యాప్‌టాప్‌ను 60 నిమిషాల్లో 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 10 గంటల పాటు సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. ఇది 10వ తరం ఇంటెల్ కోర్ i3-1005G1 డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే ఇది ఇంటెల్ UHD గ్రాఫిక్స్‌తో 8GB RAMతో మార్కెట్లోకి వస్తోంది. 

Infinix InBook Y1 Plus ఫుల్ HD డిస్ ప్లే
 15.6 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లేతో వస్తుంది. ఇది 80% sRGB ,  60% NTSC కలర్ గామట్‌తో వస్తుంది. దీని గరిష్ట బ్రైట్ నెస్ 260 నిట్‌లు కావడం విశేషం. ఇది 1920 x 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. దీని డిజైన్ గురించి చెప్పాలంటే, దీని బరువు 1.76 కిలోలు, 18.2 మిమీ స్లిమ్ గా ఉంటుంది. దీనికి అల్యూమినియం అల్లాయ్ ఫినిషింగ్ ఇవ్వబడింది. ఇది బ్లూ, గ్రే, సిల్వర్ అనే మూడు రంగులలో ప్రవేశపెట్టారు. ఇది 2MP ఫుల్ HD వెబ్‌క్యామ్‌తో వస్తోంది. 

కనెక్టివిటీ విషయానికి వస్తే Wi-Fi 5, బ్లూటూత్ v5.1, ఒక USB 2.0, రెండు USB 3.0, ఒక HDMI పోర్ట్ ,  ఒక USB టైప్-C పోర్ట్‌ కనెక్టివిటీని చూడవచ్చు. ఆడియో కోసం, ల్యాప్‌టాప్ 3.5mm హెడ్‌ఫోన్/ మైక్రోఫోన్ జాక్, డ్యూయల్ డిజిటల్ మైక్రోఫోన్‌లు, స్టీరియో స్పీకర్లు, DTS ఆడియో ప్రాసెసింగ్‌తో వస్తుంది. 
 

click me!