LIC IPO ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చుతుందా..లిస్టింగ్‌కు మరికొద్ది గంటలే మిగిలి ఉంది..ఇన్వెస్టర్ల భయాలు ఇవే

By team teluguFirst Published May 16, 2022, 12:31 PM IST
Highlights

LIC IPO Listingకు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో లిస్టింగ్ ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉందనే వార్తలు గుబులు రేపుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ప్రీమియం లిస్టింగ్ లాభాలను పొందే అవకాశం లేదనే సూచనలు గ్రేమార్కెట్ అంచనాలను బట్టి వెలువడుతున్నాయి. 

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ తర్వాత ప్రభుత్వ బీమా కంపెనీ ఎల్‌ఐసీ షేర్లు రేపు (LIC IPO) మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. రికార్డు స్థాయిలో 6 రోజులు తెరిచి ఉన్న ఎల్‌ఐసీ ఐపీఓ (LIC IPO)కు దాదాపు అన్ని కేటగిరీల్లో మంచి స్పందన వచ్చింది. గత వారం, LIC యొక్క షేర్లు కూడా అలాట్ మెంట్ అయ్యాయి. (LIC IPO Share Allotment) షేర్లు పొందిన వారికి ఈ రోజు అంటే సోమవారం వారి డీమ్యాట్ ఖాతాలో జమ చేస్తారు. IPO లిస్టింగ్ కు ముందు ఒక బ్యాడ్ న్యూస్ ఇన్వెస్టర్లను భయానికి గురి చేస్తోంది. గ్రే మార్కెట్‌లో (LIC IPO GMP) LIC IPO ప్రీమియం లిస్టింగ్‌ జరిగే అవకాశం లేదని పేర్కొంటున్నారు. నానాటికి గ్రే మార్కెట్ లో దీని వాల్యూ మరింత పడిపోతోంది. ఇది తగ్గింపుతో లిస్టింగ్‌ను సూచిస్తోంది. 

లిస్టింగ్ కు ముందే  GMP చాలా పడిపోయింది
సోమవారం, లిస్టింగ్‌కు ఒక రోజు ముందు, LIC IPO GMP మైనస్ 25 రూపాయలకు పడిపోయింది. ఒక దశలో గ్రే మార్కెట్‌లో రూ.92 ప్రీమియంతో ట్రేడయ్యింది. టాప్ షేర్ బ్రోకర్ డేటా ప్రకారం, ప్రస్తుతం LIC IPO గ్రే మార్కెట్ ప్రీమియం మైనస్ 15 రూపాయలు సూచిస్తోంది. మరోవైపు, IPO వాచ్‌లో, LIC IPO GMP  రూ. 25 తగ్గింది. అంటే పెట్టుబడిదారులు తొలిరోజే నష్టాలను చవిచూడాల్సి వస్తుందని GMP సూచిస్తోంది.

LIC IPOకు అద్భుతమైన రెస్పాన్స్...
దేశంలోని అతిపెద్ద IPOలో 16,20,78,067 షేర్లు ఆఫర్ చేయగా,  వాటికి 47,83,25,760 బిడ్లు వచ్చాయి. పాలసీ హోల్డర్స్ కేటగిరీలో IPO 6.12 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. అదేవిధంగా, ఎల్‌ఐసి ఉద్యోగుల కోసం రిజర్వ్ చేసిన భాగం 4.4 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల షేర్ కూడా 1.99 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇవి కాకుండా, QIBల కోసం కేటాయించిన భాగం 2.83 రెట్లు, NII భాగం 2.91 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. మొత్తంమీద, LIC IPO 2.95 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది.

ఎల్‌ఐసీ ఐదో అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది
బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలలో డిస్కౌంట్ లిస్టింగ్ తర్వాత కూడా, ఎల్‌ఐసి మార్కెట్ క్యాప్ (ఎల్‌ఐసి ఎంకాప్) రూ. 6 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు సూచిస్తోంది. ఇదే జరిగితే, మార్కెట్‌లో లిస్ట్ అయిన వెంటనే ఎల్‌ఐసీ భారతదేశంలో ఐదవ అతిపెద్ద పబ్లిక్ కంపెనీగా అవతరిస్తుంది. మార్కెట్ క్యాప్ అంటే వాల్యుయేషన్ పరంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC Bank, INFOSYS మాత్రమే ప్రభుత్వ బీమా కంపెనీ కంటే ముందు ఉంటాయి.

click me!