LIC IPO: ఎల్ఐసీ షేర్లు అలాట్ అయ్యాయా...మే 17న లిస్టింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహం ఇదే...

By team teluguFirst Published May 14, 2022, 3:05 PM IST
Highlights

LIC IPO Listing Day Strategy: దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ షేర్ల అలాట్ మెంట్ జరిగిపోయింది. ఇక మిగిలింది మే 17వ తేదీ మంగళవారం లిస్టింగ్ మాత్రమే. 6 రోజుల పాటు తెరిచి ఉన్న ఈ ఇష్యూకి ఇన్వెస్టర్లు 2.95 రెట్లు సబ్‌స్క్రైబ్ చేశారు. అయితే ఇప్పుడు లిస్టింగ్ రోజున ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో తెలియక ఇన్వెస్టర్లు చాలా మంది అయోమయంలో ఉన్నారు.

శుక్రవారం గ్రే మార్కెట్‌లో ఎల్‌ఐసీ ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే రూ.9 అంటే రూ.940 తగ్గింపుతో ఇన్వెస్టర్ల గందరగోళం మరింత పెరిగింది. LIC  IPO కోసం, ప్రభుత్వం ఒక్కో షేరుకు రూ. 902-949 ధర బ్యాండ్‌ను ఉంచింది, అయితే తుది ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ. 949గా నిర్ణయించారు.  ప్రత్యేక తగ్గింపు కారణంగా, ఎల్‌ఐసి పాలసీదారులు ఈ షేర్లను రూ.889కి మరియు రిటైల్ ఇన్వెస్టర్లు రూ.904కి పొందుతారు. మార్కెట్ విశ్లేషకులు ఈ సమస్యపై మిశ్రమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, LIC స్టాక్ 10 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉందని. మరికొందరు డిస్కౌంట్ తో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎల్‌ఐసీ షేర్ల లిస్టింగ్‌పై వ్యూహం ఎలా ఉండాలి?

>> మార్కెట్‌లో తీవ్ర అస్థిరత ప్రభావం ఎల్‌ఐసీ లిస్టింగ్‌పై కనిపించవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం, LIC  షేర్లు డిస్కౌంట్ తో లిస్ట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. అంటే లిస్టింగ్ లాభం పొందే అవకాశం లేదని అర్థం. అయితే, పాలసీదారులు, రిటైల్ పెట్టుబడిదారులు తగ్గింపుతో షేర్లను పొందినట్లయితే, వారు కొంత లిస్టింగ్ లాభం పొందవచ్చు.

>> LIC లిస్టింగ్ ఇష్యూ ధరకు 5-10 శాతం ప్రీమియంతో ఉంటుందని పెట్టుబడి సలహాదారు సందీప్ సబర్వాల్ అభిప్రాయపడ్డారు. సబర్వాల్ ప్రకారం, ఎల్‌ఐసి షేర్లు ఇష్యూ ధర సమీపంలో లిస్్ అయితే మాత్రం, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది మంచి పెట్టుబడి అవకాశమని పేర్కొన్నారు.

>> IPO నిపుణుడు ఆదిత్య కొంద్వార్ ప్రకారం, LIC IPO గురించి సానుకూల, ప్రతికూలం రెండూ ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, లిస్ట్ అయిన తర్వాత మార్కెట్ వాతావరణం ఎలా ఉందో దాని ప్రకారం, తదనుగుణంగా తదుపరి వ్యూహాన్ని రూపొందించుకోవాలని సూచించారు. 

>> కాపిటల్వియా గ్లోబల్ రీసెర్చ్ విశ్లేషకుడు అఖిలేష్ జాట్ అంచనా ప్రకారం, మార్కెట్ అస్థిరంగా ఉంటే, ఎల్‌ఐసి షేర్లు డిస్కౌంట్ రేటుతో లిస్ట్ అవుతాయని అభిప్రాయపడ్డారు. ఇన్సూరెన్స్ వ్యాపారంలో పెట్టుబడి దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టాలని ఆయన పెట్టుబడిదారులకు సలహా ఇచ్చాడు.

దేశంలోనే అతిపెద్ద IPO
ఎల్‌ఐసీ రూ.21 వేల కోట్ల ఇష్యూ దేశంలోనే అతిపెద్ద ఐపీఓ. గత ఏడాది 2021లో ఐపీఓ ద్వారా రూ.18300 కోట్లు సమీకరించిన పేటీఎం పేరిట ఈ రికార్డు అంతకుముందు ఉంది. ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా ప్రభుత్వం తన వాటాను 3.5 శాతం తగ్గించుకుంది.

click me!